ఇక్కడ ఇడ్లీలను ఒక పెద్దాయన అది కూడా చాలా టెక్నాలజీతో చేస్తుండటం విశేషం. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఆనంద్ మహీంద్రా... పరిచయం అక్కర్లేని పేరు. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా.... సోషల్ మీడియాలోనూ ఆయనకంటూ ఓ క్రేజ్ ఉంది. పలు ఆసక్తికర విషయాలను ఆయన ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇడ్లీ పై తనకున్న ప్రేమను మరోసారి పంచుకున్నారు.

గతంలో ఆనంద్ మహీంద్రా ఓ ఇడ్లీ అమ్మ గురించి షేర్ చేశారు. 2019లో, తమిళనాడులో కేవలం రూపాయికి ఇడ్లీలను విక్రయించే ‘ఇడ్లీ అమ్మ’ అకా కె కమలతల్ ప్రయత్నాలను మెచ్చుకున్నారు. ఆమెకు వంట చేసుకోవడానికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అందించిన ఆయన... ఆ తర్వాత ఆమెకు ఇల్లు ఇస్తానని కూడా మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దాని ప్రకారం.. ఆయన నిజంగానే ఆమెకు 2022లో ఇల్లు కట్టించారు. కాగా... తాజాగా.. ఆయన మరో ఇడ్లీ వీడియోని షేర్ చేశారు. ఇక్కడ ఇడ్లీలను ఒక పెద్దాయన అది కూడా చాలా టెక్నాలజీతో చేస్తుండటం విశేషం. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.

ఓ వ్యక్తి కస్టమర్ల కోసం భారీ సంఖ్యలో ఇడ్లీలు వేస్తున్న వీడియో ఇది. ఇడ్లీ మౌల్డ్‌లో పిండి వేయడం, ఇడ్లీలు ఉడికాయో లేదో చెక్ చేయడం.. ఇలా ప్రతిదీ తనదైన శైలిలో వేగంగా చేశాడా వ్యక్తి. ఈ వీడియోని షేర్ చేస్తూ... ఆయన రాసిన క్యాప్షన్ కూడా నెట్టింట ఆకట్టుకుంటోంది.

Scroll to load tweet…

‘ఇళ్లల్లో ఆడవాళ్లు నెమ్మదిగా, శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. మరోవైపు, వ్యాపారం చేసే వాళ్లు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు సిద్ధం చేస్తుంటారు. ఇడ్లీలు సిద్ధం చేసే పద్ధతి ఏదైనప్పటికీ.. అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది’ అంటూ క్యాప్షన్ ఇఛ్చారు.

4.53 నిమిషాల వీడియోలో, ఒక వ్యక్తి తన చేతులతో డిఎల్‌ఐ ట్రేల స్టాక్‌లను శుభ్రం చేయడం మరియు పిండిలో పోయడం కనిపిస్తుంది. తరువాత, అతను ట్రేలను స్టీమర్‌లో ఉంచి, ఆపై ఇడ్లీలను డీమోల్డ్ చేస్తాడు. వీడియోలో కొబ్బరి చట్నీ, సాంబార్ తయారు చేయడం స్పష్టంగా కనపడుతోంది.