Asianet News TeluguAsianet News Telugu

స్ట్రీట్ డ్యాన్స్ బెగ్గర్ కి.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్...

సంగీతం, డ్యాన్సుల మీద ప్రేమతో నిత్యం కన్నాట్ ప్లేస్ లో ఫుట్ పాత్ లపై స్ట్రీట్ పెర్ఫార్మర్ గా వరుణ్ ప్రదర్శనలు ఇచ్చేవాడు. బిచ్చగాడిగా భావించిన పోలీసులు బెదిరించే వారు మరికొందరు అరకొర చిల్లర విదిల్చేవారు. వాటితో కడుపు నిండకపోయినా కళను వదిలేయలేదు. కొన్నాళ్లకి అతని కళకి గుర్తింపు వచ్చింది. క్రమంగా ఆ స్ట్రీట్ పెర్ఫార్మర్ కి అభిమానులు పెరిగారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్ మీద చిన్న కథనం ప్రసారం చేసింది. 

Anand Mahindra lauds Delhi busker Varun Dagar asks him to dance on
Author
Hyderabad, First Published Jan 4, 2022, 2:19 PM IST

వేల కోట్ల బిజినెస్ తో నిత్యం బిజీగా ఉంటూనే సమకాలిన అంశాలపై స్పందిస్తుంటారు Anand Mahindra. అంతేకాదు అవకాశాలు రాక.. గుర్తింపుకు నోచుకోకుండా మరుగున పడిపోయిన ప్రతిభను social media వేదికగా పట్టుకుంటారు. ఈ Local Talent ని ప్రశంసలతో వదిలేయకుండా అద్భుతమైన అవకాశాలను కల్పించడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఓ Street Performer ఆయన కంట పడ్డాడు. అతని దశ తిరిగే ఆఫర్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. 

కన్నాట్ ప్లేస్.. కళాకారుడు.. 
హర్యానాకి చెందిన వరుణ్ అనే యువకుడికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. శబ్దానికి తగ్గట్టుగా నర్తించడం అంటే ఇష్టం. కానీ అదే అతనికి కష్టాలను కొని తెచ్చింది. సంగీతం డ్యాన్సులంటూ పనిచేయకుండా పరువు తీస్తున్నాడని ఉన్న ఊరూ, కన్న తల్లితండ్రులు అడ్డు చెప్పడంతో ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ కన్నాట్ ప్లేస్ లో ఫుట్ పాత్ మీద తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు.

ఆ స్టోరీతో వెలుగులోకి..
సంగీతం, డ్యాన్సుల మీద ప్రేమతో నిత్యం కన్నాట్ ప్లేస్ లో ఫుట్ పాత్ లపై స్ట్రీట్ పెర్ఫార్మర్ గా వరుణ్ ప్రదర్శనలు ఇచ్చేవాడు. బిచ్చగాడిగా భావించిన పోలీసులు బెదిరించే వారు మరికొందరు అరకొర చిల్లర విదిల్చేవారు. వాటితో కడుపు నిండకపోయినా కళను వదిలేయలేదు. కొన్నాళ్లకి అతని కళకి గుర్తింపు వచ్చింది. క్రమంగా ఆ స్ట్రీట్ పెర్ఫార్మర్ కి అభిమానులు పెరిగారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్ మీద చిన్న కథనం ప్రసారం చేసింది. 

ఆనంద్ ప్రశంసలు..
స్ట్రీట్ పెర్ఫార్మర్ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు ఆనంద్ మహీంద్రా. డ్యాన్స్ లో మనందరం భాగమే. డ్యాన్స్ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇక మీద ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ మీడియా ప్రసారం చేసిన వీడియోను ట్విట్టర్ షేర్ చేశారు. 

బాలీవుడ్ కి బాటలు...??
వరుణ్ డ్యాన్స్ కి పాటకి ముగ్ధుడై ప్రశంసలతోనే వదిలేయలేదు ఆనంద్ మహీంద్రా. వరుణ్ ప్రతిభకి సరైన వేదిక కల్పించే పనిలో పడ్డారు. మహీంద్రా గ్రూపు కల్చరల్ విభాగం హెడ్ జయ్ ఏ షాని లైన్ లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీంద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్ ఈవెంట్స్ లో వరుణ్ ప్రోగ్రామ్ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏనాటికైనా బాలీవుడ్ లో అడుగు పెట్టాలనే వరుణ్ కల ఆనంద్ మహీంద్రా తోడ్పాటుతో నిజం అయ్య అవకాశాలు ఉన్నాయేమో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios