ఆయన షేర్ చేసిన పోస్టులో ఓ సింహం ఉంది. దాని నోట్లో ఓ కెమేరా ఉంది. ఆ ఫోటోకి ఆయనకు క్యాప్షన్  ఏం పెట్టాలో తెలీలేదట. అందుకే దానికి మంచి కాప్షన్ చెప్పిన వారికి బహుమతి ఇస్తాననన్నారు. 

ఓ వ్యాపారవేత్తగా ఆనంద్ మహేంద్రా అందరికీ పరిచయమే. అయితే, ఆయన తన ప్రజలకు మాత్రం సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్యారు. ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పటికప్పుడు స్ఫూర్తిని ఇచ్చేవి, నచ్చేవి, ఆకట్టుకునేవి షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఆయన ఓ పోటీ పెట్టారు. ఓ ఫోటో షేర్ చేసి దానికి మంచి కాప్షన్ ఇచ్చిన వారికి ఓ బహుమతి ఇస్తానంటూ ప్రకటించారు.

ఆయన షేర్ చేసిన పోస్టులో ఓ సింహం ఉంది. దాని నోట్లో ఓ కెమేరా ఉంది. ఆ ఫోటోకి ఆయనకు క్యాప్షన్ ఏం పెట్టాలో తెలీలేదట. అందుకే దానికి మంచి కాప్షన్ చెప్పిన వారికి బహుమతి ఇస్తాననన్నారు. తమ కంపెనీకి చెందిన టాయ్ ట్రక్ ని బహుమతిగా ఇస్తామని అనౌన్స్ చేశారు.

Scroll to load tweet…

సింహం ఐకానిక్ చిత్రాన్ని 2018 సంవత్సరంలో బోట్స్వానాలో వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ బార్బరా జెన్సన్ వోర్స్టర్ తీశారు. ఈ ఫోటోకి క్యాప్షన్ కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, అందుకే ఈ పోటీ పెడుతున్నట్లు చెప్పారు. ఆయన పోటీకి చాలా మంది ఉత్సాహం చూపించారు. అందులో ముంబయి పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘మీ తరువాతి తరం నన్ను భూమి మీద చూడాలని అనుకుంటన్నారా లేక కెమేరాలోనా’ అంటూ ముంబయి పోలీసులు ఇచ్చిన రిప్ల అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది నెటిజన్లు కూడా మంచి, మంచి కాప్షన్లు ఇవ్వడం గమనార్హం.