Toronto: కార్తీక్ సైనీ ఆగస్టు 2021లో భారతదేశం నుండి కెనడాకు వచ్చాడని స‌మీప బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కార్తీక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి పంపాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారని తెలిపారు. 

Indian student: కెనడాలో జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదంలో ఓ భార‌తీయ‌ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు కార్తీక్ సైనీ అనీ, అత‌ను ఆగస్టు 2021లో భారతదేశం నుండి కెనడాకు వచ్చాడని స‌మీప బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కార్తీక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి పంపాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారని తెలిపారు.


వివ‌రాల్లోకెళ్తే.. టొరంటో సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా పికప్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో 20 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి కార్తిక సైనీ మ‌ర‌ణించిన‌ట్టు కెన‌డా మీడియా కథనం తెలిపింది. బాధితురాలి బంధువు పర్వీన్ సైనీని ఉటంకిస్తూ కార్తీక్ సైనీ ఆగస్టు 2021లో భారతదేశం నుండి కెనడాకు వచ్చాడని పేర్కొంది. పర్వీన్ సైనీ హర్యానాలోని కర్నాల్ నుండి మాట్లాడారనీ సంబంధిత కథ‌నం పేర్కొంది. అంత్యక్రియల కోసం కార్తీక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి పంపాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారని పర్వీన్ చెప్పారు. షెరిడాన్ కాలేజీ కార్తిక్ త‌మ విద్యార్థి అని ధృవీకరించిందని నివేదిక పేర్కొంది.

"కార్తీక్ ఆకస్మిక మరణం పట్ల మా సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులు, సహచరులు, ప్రొఫెసర్లకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము" అని కళాశాల శుక్రవారం ఒక ఇమెయిల్‌లో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు యోంగే స్ట్రీట్, సెయింట్ క్లెయిర్ అవెన్యూ కూడలి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మిడ్‌టౌన్‌లో పికప్ ట్రక్కు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో సైక్లిస్ట్ మరణించాడని గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రోడ్డు ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల విభాగ బృందం అక్క‌డికి చేరుకునీ, వైద్యం అందించింది. అయితే, తీవ్ర గాయాలు కావ‌డంతో అత‌ను సంఘటనా స్థలంలో మరణించినట్లు ప్రకటించారు. ఈ రోడ్డు ప్ర‌మాదంపై దర్యాప్తు కొనసాగుతోందని టొరంటో పోలీస్ సర్వీస్ ప్రతినిధి కానిస్టేబుల్ లారా బ్రబంత్ తెలిపారు.

Scroll to load tweet…

"అభియోగాలు మోపబడాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది, ఎందుకంటే పరిశోధకులకు ముందుగా పూర్తి విచారణ జరపవలసి ఉంటుంది" అని బ్రబంత్ అన్నారు. అడ్వకేసీ ఫర్ రెస్పెక్ట్ ఫర్ సైక్లిస్ట్‌లు అనే గ్రూప్ నవంబర్ 30న కార్తీక్ గౌరవార్థం రైడ్‌ను నిర్వహిస్తోంది. పాల్గొనేవారు బ్లూర్ స్ట్రీట్, స్పాడినా అవెన్యూలోని మాట్ కోహెన్ పార్క్ వద్ద కలుస్తారు. క్రాష్ సైట్ వద్ద సంబంధిత బైక్ (ghost bike)ను ఉంచడంతో రైడ్ ముగుస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కార్తీక్ సైనీ కుటుంబం హర్యానాకు చెందినవారు.