35 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు.. 88 ఏళ్ల వయస్సులో వరించిన అదృష్టం !
Punjab: 35 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొన్న 88 ఏళ్ల వృద్ధుడి అదృష్టం మలుపు తిరిగి లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. పంజాబ్ లోని దేరబస్సీకి చెందిన మహంత్ ద్వారకా దాస్ గత 35-40 ఏళ్లుగా లాటరీలు కొనుగోలు చేస్తుండగా ఎట్టకేలకు విజేతగా నిలిచిన టికెట్ లభించింది.
Lohri Makar Sankranti Bumper Lottery: గత 35 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. చాలా కాలం నుంచి ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు. అయినా లాటరీ టిక్కెట్లు కొనడంలో విసుగుచెందని ఆ వ్యక్తిని 88 ఏండ్ల వయస్సులో అదృష్టం వరించింది. 35 ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్న ఒక 88 ఏండ్ల వృద్దిని తాజాగా అదృష్టం వరించింది. పంజాబ్ లాటరీలో 5 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేవ్.. ! దీనికి సంబంధించి ఫొటోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాల్లోకెళ్తే.. 35 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొన్న 88 ఏళ్ల వృద్ధుడి అదృష్టం మలుపు తిరిగి లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. పంజాబ్ లోని దేరబస్సీకి చెందిన మహంత్ ద్వారకా దాస్ గత 35-40 ఏళ్లుగా లాటరీలు కొనుగోలు చేస్తుండగా ఎట్టకేలకు విజేతగా నిలిచిన టికెట్ లభించింది. లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023లో మహంత్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. లాటరీ గెలుచుకున్న తర్వాత ఆయన ఆనందానికి అవధుల్లేవ్.. ! ఈ సంతోషం మాటల్లో చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.
లాటరీలో 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న తర్వాత మహంత్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, తాను చాలా సంతోషంగా ఉన్నాననీ, ప్రైజ్ మనీని తన ఇద్దరు కుమారులు, తన 'డేరా'కు పంపిణీ చేస్తానని చెప్పారు. 'నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గత 35-40 ఏళ్లుగా లాటరీలు కొంటున్నాను. గెలిచిన మొత్తాన్ని నా ఇద్దరు కుమారులకు, నా డేరాకు పంచుతాను' అని లాటరీ విజేత మహంత్ ద్వారకా దాస్ తెలిపారు. లాటరీ టికెట్ కొనుక్కోవడానికి తన తండ్రి తన మనవడికి డబ్బులు ఇచ్చారని, ఆయన గెలిచారని మహంత్ కుమారుడు నరేందర్ కుమార్ శర్మ ఏఎన్ఐతో చెప్పారు. మేము సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు.
అయితే లాటరీ బహుమతి పన్ను మినహాయింపుకు లోనవుతుండటంతో మహంత్ కు లాటరీలో పూర్తి మొత్తం అంటే రూ.5 కోట్లు లభించవు. అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ ప్రకారం, మహంత్ రూ.5 కోట్ల నుండి 30% పన్ను తగ్గింపు తర్వాత లాటరీ మొత్తాన్ని అందుకుంటారు. కాగా, పంజాబ్ స్టేట్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీ 2023 ఫలితాలు జనవరి 16న విడుదలయ్యాయి. మొదటి బహుమతి రూ.5 కోట్లను ద్వారకా దాస్ గెలుచుకున్నారు. నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, 30% పన్ను మినహాయించిన తర్వాత ఈ మొత్తాన్ని అతనికి ఇస్తారని అసిస్టెంట్ లాటరీ డైరెక్టర్ కరమ్ సింగ్ ఏఎన్ఐకి తెలిపారు.