అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయిన భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానంలో ప్రయాణించిన వారిలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది.

మంగళవారం ఏఎన్-32 విమాన శకలాలను వాయుసేన బృందం గుర్తించింది. అనంతరం ఘటనాస్థలికి గురువారం గాలింపు బృందం చేరుకున్నట్లుగా పేర్కొంది. కాగా మృతులను భారత వాయుసేన ప్రకటించింది

1. వింగ్ కమాండర్ జీఎం చార్లెస్
2. స్క్వాడ్రన్ లీడర్ హెచ్ వినోద్
3. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆర్ థాపా
4. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏ తన్వర్
5.  ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ మహంతి
6. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎంకే గార్గ్
7. వారెంట్ ఆఫీసర్ కేకే మిశ్రా
8. సెర్జంట్ అనూప్ కుమార్
9. కార్పొరల్ షెరిన్
10. లీడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాన్ ఎస్‌కే సింగ్
11. లీడ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాన్ పంకజ్
12. నాన్ కంబాటంట్ ఎంప్లాయి పుతలి
13. నాన్ కంబాటంట్ ఎంప్లాయి రాజేశ్ కుమార్

ఈ నెల మూడో తేదీన ఏఎన్-32 విమానం అసోంలోని జోర్హాట్ నుంచి మెంచుకాకు బయలుదేరింది. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఎగురుతున్న సమయంలో రాడార్ నుంచి ఆదృశ్యమైన సంగతి తెలిసిందే. లిపోకు ఉత్తరాన, టాటోకు ఈశాన్యాన 16 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను వాయుసేన గుర్తించింది.