Asianet News TeluguAsianet News Telugu

ఉచిత వాగ్దానాలు చేసిన వారిని గుజరాత్ తిరస్కరించింది: ఆప్‌పై అమిత్ షా ఫైర్

గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధించిన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా గట్టి సవాల్‌ విసిరిన ఆప్‌ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Amit Shah says Gujarat Rejected Those Who Promised Freebies
Author
First Published Dec 8, 2022, 3:02 PM IST

గుజరాత్‌లో బీజేపీ భారీ విజయాన్ని సాధించిన తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఉచిత వాగ్దానం చేసేవారిని రాష్ట్రం తిరస్కరించిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఉచితాలు, బుజ్జగింపుల రాజకీయాలు చేసేవారిని తిరస్కరించడం ద్వారా అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వర్ణించే నరేంద్ర మోదీ-జీ బీజేపీకి గుజరాత్ అపూర్వమైన ఆదేశం ఇచ్చిందని అమిత్ షా వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

'మహిళలు, యువకులు, రైతులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని హృదయపూర్వకంగా మద్దుత ఇస్తున్నారని ఈ భారీ విజయం చాటిచెప్పిందని అన్నారు. గుజరాత్ ఎప్పుడూ చరిత్ర సృష్టిస్తునే ఉంటుందనీ, గత రెండు దశాబ్దాల్లో మోదీజీ నాయకత్వంలో బీజేపీ అభివృద్ధి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందనీ,  నేడు గుజరాత్ ప్రజలు మరోసారి బీజేపీని ఆశీర్వదించారనీ, ఈ  విజయంతో గతంలోని అన్ని రికార్డులను బద్దలయ్యాయని అన్నారు. ఇది నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని  అన్నారు.

 
గుజరాత్‌లోని 182 సీట్లలో 150కి పైగా బీజేపీ గెలుపొందడంతోపాటు 1985లో కాంగ్రెస్ 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఆల్ టైమ్ కనిష్టానికి 20కి పడిపోయింది. గుజరాత్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా గట్టి సవాల్‌ విసిరిన ఆప్‌ ఐదు స్థానాల్లోనే విజయం సాధించింది. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios