టీ20 ప్రపంచకప్ రౌండ్-12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 4 వికెట్ల తేడాతో ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియాకు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఉత్కంఠ భరితమైన విజయంతో శుభారంభం చేసింది. మెల్‌బోర్న్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత్ గెలుపొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఇఫ్తికర్ అహమ్ అర్ధ సెంచరీ, షాన్ మసూద్ అజేయ అర్ధ సెంచరీతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి భారత్‌కు 160 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ స్కోరును ఛేదించిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తనను ‘ద ఛేజ్ మెషిన్’ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు.
విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. టీమిండియాను ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయంపై దేశ అగ్ర రాజకీయ నేతలు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ప్రసంశలతో టీమిండియాను ముంచెత్తున్నారు.
దీపావళి ప్రారంభం
భారత్ విజయం సాధించిన అనంతరం హోంమంత్రి అమిత్ షా టీమిండియాకు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇక దీపావళి ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.ఈ విజయం సాధించిన టీమ్ మొత్తానికి అభినందనలు అని పేర్కొన్నారు.
విజయం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జయ్ షా కూడా ట్వీట్ చేశారు. 'ఛేజ్ మాస్టర్ మీరు ఆట తీరునే మార్చారు. విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రతిభ కనబరిచాడో? ఈ రోజు మనం చూశాం!'అని ట్విట్ చేశారు.
పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అపూర్వ విజయం సాధించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుతమైన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులందరినీ సంతోషపెట్టింది. ఈ అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని ట్వీట్ చేశారు.
ప్రపంచకప్ గెలుస్తాం..: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఎంత గొప్ప మ్యాచ్. విరాట్ అద్భుత ఆటతో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించినందుకు టీమ్ ఇండియాకు, దేశప్రజలందరికీ అభినందనలు. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచకప్‌ను గెలువాలి " అని పేర్కొన్నారు.
గెలవడం అలవాటుగా మారింది : సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేస్తూ ఇలా వ్రాశారు- "గెలవడం అలవాటు. మీరు టీమ్ ఇండియా గురించి గర్వపడుతున్నారు. జై హో.భారత్ " అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ..టీమ్ ఇండియా కు అభినందనలు తెలిపారు. ‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఎంత ఉత్కంఠ నెలకొంది.భారత్ సాధించిన పెద్ద విజయాల్లో ఒకటి. వెల్ డన్..టీమ్ ఇండియా. రాబోయే మ్యాచ్‌లకు శుభాకాంక్షలు''అని అన్నారు.
ప్రియాంక గాంధీ ట్వీట్ చేస్తూ, 'అద్భుతమైన మ్యాచ్.. చివరి వరకు పోరాడిన భారత్ ఎంతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో దీపావళి ఆనందాన్ని రెట్టింపు చేసారు. భారత క్రికెట్ జట్టుకు పలువురు అభినందనలు తెలిపారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. జై హింద్.' అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. పాక్‌పై అద్భుత విజయం సాధించిన టీమ్‌ఇండియాకు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు.మన క్రికెటర్ల ప్రదర్శన నిజంగా చూడదగ్గది. రాబోయే రోజుల్లో జట్టు విజయాల పరంపరను కొనసాగాలని ఆశించారు.
