Asianet News TeluguAsianet News Telugu

మమతా బెనర్జీ, అమిత్ షా పేస్ టు పేస్.... కలిసి భోజనం

ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు మమతా, అమిత్ షా లు ఒకే చోట కలవడమే విశేషం... అలాంటిది ఇద్దరు కలిసి ఒకే టేబుల్ పై భోజనం చేస్తే... ఆహ ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందనడంలో డౌట్ లేదు. 

Amit Shah, Mamata Banerjee Face-To-Face , have lunch together
Author
Bhubaneswar, First Published Feb 29, 2020, 12:09 PM IST

యావత్ భారతదేశంలోనే బీజేపీ నేతలను అదే స్థాయిలో ఎవరన్నా ఎదుర్కునే స్ట్రీట్ ఫైటర్ ఉన్నారంటే అది కేవలం మమతా బెనర్జీ మాత్రమే. ఆమె బీజేపీని బీజేపీ స్టయిల్లో ఎదుర్కోవడంలో దిట్ట. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో బీజేపీ నేతలఅందరికి మమతా బెనర్జీ పక్కలో బల్లెంగా తయారయ్యింది. 

ఇక ఆమెకు, హోమ్ మంత్రి అమిత్ షాకి మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతుంది. పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడిన ప్రతిసారి మమతా బెనర్జీ ని టార్గెట్ చేయకుండా వదల్లేదు. సమయం దొరికినప్పుడు మమతా కూడా అలానే విరుచుకుపడుతుంది. 

ఇలాంటి ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు మమతా, అమిత్ షా లు ఒకే చోట కలవడమే విశేషం... అలాంటిది ఇద్దరు కలిసి ఒకే టేబుల్ పై భోజనం చేస్తే... ఆహ ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందనడంలో డౌట్ లేదు. 

ఇప్పుడు తాజాగా అలంటి ఒక చిత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇలా ఇద్దరు నేతలు ఒకే చోట కూర్చొనే ఇలా భోజనం చేసేలా ఏర్పాటు చేసినందుకు నవీన్ పట్నాయక్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. 

ఇంతకు వివరాల్లోకి వెళితే... తూర్పు జోనల్ కౌన్సిల్ మీటింగ్ ను ఒడిశాలో ఏర్పాటు చేశారు. ఇలా అన్ని జోనల్ కౌన్సిల్ మీటింగులకు చైర్మన్ గా హోమ్ మంత్రి వ్యవహరిస్తారు. అలా ఈసారి ఈ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ను ఒడిశాలో ఏర్పాటు చేసినప్పుడు ఆన్ జోన్ లోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడకు వచ్చారు.

వారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్లు వచ్చారు. ఈ మీటింగ్ కు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఒకరు మాత్రం రాలేకపోయారు. 

మీటింగ్ ముగియగానే నవీన్ పట్నాయక్ తన స్వగృహంలో ఈ విందును ఏర్పాటు చేసారు. ఈ విందుకు అమిత్ షాతో పాటు గా ముఖ్యమంత్రులందరు హాజరయ్యారు. అలా అప్పుడు మమతా బెనర్జీ, అమిత్ షా ఒక్క ఫొటోలో చూసే భాగ్యం మనకు దక్కింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో నవీన్ పట్నాయక్ షేర్ చేసాడు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios