పంజాబ్ సమస్యలపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. సీఎం భగవంత్ మాన్ తన సమయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోసం వేచించి..దేశవ్యాప్త ప్రచారం చేస్తున్నారనీ, అలా చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారిపోతున్నాయని అన్నారు.
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన సమయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కోసం వేచించి.. దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడనీ, ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారిపోతున్నాయని అన్నారు. భగవంత్ మన్ ముఖ్యమంత్రినా? లేక పైలటా ? అనే సందేహం వస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో బిజెపి నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. "నా మొత్తం జీవితంలో ఆప్ నేతృత్వంలోని అటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. బూటకపు వాగ్దానాలు చేయడం వారికే దక్కింది" అని విమర్శించారు.
సీఎం మాన్‌పై దాడి చేస్తూ.. ‘ ఈ ముఖ్యమంత్రికి ఒకే ఒక పని ఉంది. కేజ్రీవాల్ చెన్నైకి వెళ్లాల్సి వస్తే.. అతడు చెన్నై తీసుకెళ్లేందుకు విమానంలో ఢిల్లీకి వెళతారు. కేజ్రీవాల్ కోల్‌కతాకు వెళ్లవలసి వస్తే.. ఇతడు( సీఎం)విమానం ఎక్కి కోల్‌కతాకు తీసుకువెళతాడు. కేజ్రీవాల్ దేశవ్యాప్త పర్యటనలను పంజాబ్ ముఖ్యమంత్రే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఆయన( భగవంత్ మాన్) ముఖ్యమంత్రేనా లేక కేజ్రీవాల్ పైలట్‌నా? అనే సందేహం వస్తుంటుంది. సీఎం మాన్ తన సమయమంతా కేజ్రీవాల్ సందర్శనలకే వేచిస్తున్నాడు. దీని ఫలితంగా పంజాబ్‌లో శాంతిభద్రతలు మరింత దిగజారుతున్నాయి. ఇక్కడి ప్రజలు సురక్షితంగా లేరు. " అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందనీ, మరోవైపు రైతులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ సీఎం మాన్ ఈ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తనతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు మాన్‌ను తీసుకెళ్తున్నారని, తద్వారా ఆయన మాన్ అధికారిక విమానంలో ప్రయాణించవచ్చని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన పలువురు నాయకులు ఆరోపించారు. ..
అలాగే.. ఆప్ చేసిన ఎన్నికల వాగ్దానాలపై కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ. 1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పుడు నేరవేర్చుతారని చాలా మంది ఎదురు చూస్తున్నారని విమర్శిస్తున్నారనీ, సీఎం భగవంత్ మాన్ , కేజ్రీవాల్‌లను ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని అమిత్ షా అన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో అనే విజయాలను సాధించమనీ, భారతదేశం నేడు 'గ్రోత్ ఇంజన్'గా పిలువబడుతుందని అన్నారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
