New Delhi: రూ.8 వేల కోట్లతో 3 భారీ విపత్తు నిర్వహణ పథకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాలతో జరిగిన సమావేశం అనంతరం ఈ పథకాలను ప్రకటించారు. 

Disaster management schemes: విపత్తు నిర్వహణకు రూ.8,000 కోట్లకు పైగా విలువైన మూడు ప్రధాన పథకాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాలతో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ పథకాలను ప్రకటించారు.

విపత్తు నిర్వహణ మూడు ప్రధాన పథకాలు:

  1. రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునీకరణకు రూ.5,000 కోట్ల ప్రాజెక్టు
  2. ముంబయి, చెన్నై, కోల్ కతా బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే నగరాలకు రూ.2,500 కోట్ల ప్రాజెక్టు
  3. కొండచరియలు విరిగిపడకుండా 825 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.17 కోట్లతో జాతీయ కొండచరియలు విరిగిపడే ప్రమాద నివారణ పథకం.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ మంత్రుల సమావేశం అనంతరం అమిత్ షా మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో ఎంతో మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. "గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఈ రంగంలో ఎంతో సాధించాయి. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ విపత్తులు వాటి రూపాన్ని మార్చాయి. వాటి ఫ్రీక్వెన్సీతీవ్రతలు పెరిగాయి కాబట్టి మేము అంతటితో ఆగిపోలేము. మనం మరింత విస్తృతమైన ప్రణాళికను చేయవలసి ఉంటుంది.." అని షా అన్నారు. అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రాలకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన కఠినమైన ప్రోటోకాల్ ను ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

విపత్తు వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు: అమిత్ షా

ఏ విపత్తు వల్ల ఏ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రతి ఒక్కరి లక్ష్యమని హోంమంత్రి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరం కలిసి ముఖ్యమంత్రులంతా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. మరింత కష్టపడి ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఏడు అణువిద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్న రాష్ట్రాల్లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) పర్యటించిందనీ, ఈ రాష్ట్రాలకు కఠినమైన ప్రోటోకాల్ ను పంపిందని, తద్వారా ఏదైనా విపత్తును నివారించవచ్చని అమిత్ షా చెప్పారు. "సంబంధిత రాష్ట్రాలన్నీ దీనికి ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అణువిద్యుత్ కేంద్రాల ప్రారంభానికి ముందు, విద్యుదుత్పత్తికి ముందు ఎలాంటి విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలో చెప్పాలి. ఇది మనందరికీ ఎంతో అవసరమని" అన్నారు.

'రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి'

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న రైతులకు పరిహారాన్ని పెంచాలని కొందరు రాష్ట్ర మంత్రులు చేసిన సూచనలపై హోం మంత్రి స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిశీలిస్తుందనీ, అయితే రాష్ట్రాలు కూడా దాని కోసం బడ్జెట్ కేటాయింపులను పెంచాలని అన్నారు. మోడల్ ఫైర్ బిల్లు, విపత్తు నివారణ విధానం, ఉరుములు-మెరుపుల విధానం, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కోల్డ్ వేవ్ పాలసీ గురించి మాట్లాడుతూ, మెజారిటీ రాష్ట్రాలు వాటిని అమలు చేయలేదని లేదా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించలేదని అమిత్ షా అన్నారు. అన్ని రాష్ట్రాలు ప్రాధాన్యతా క్రమంలో పనిచేయాలనీ, ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసిన లేదా రూపొందించిన వాటిని ఆయన అభినందించారు.