భోపాల్: బర్డ్ ఫ్లూ లక్షణాలు కన్పించడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసార్ లో 15 రోజుల పాటు చికెన్, కోడిగుడ్ల విక్రయాలను నిలిపివేయాలని  అధికారులు ఆదేశించారు.

కాకులలో బర్డ్ ఫ్లూ లక్షణాలను గుర్తించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా  సుమారు 100 కాకులు మరణించాయి. 
ఇండోర్ మరణించిన కాకుల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ  వైరస్ ను గుర్తించారు. 

చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు కన్పించడంతో ఇండోర్ లో రాష్ట్ర ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చెప్పారు. 

గత ఏడాది డిసెంబర్ 23 నుండి  ఈ ఏడాది జనవరి 3 వ తేదీ వరకు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పలు కాకులు మృతిచెందాయి. ఇండోర్ లో 142 , మందసార్ లో 100, ఆగార్, మాల్వాలో112, ఖర్జాన్ లో 13, షీహోర్ జిల్లాలో 9 కాకులు మరణించాయి.

కేరళ రాష్ట్రంలో కూడ బర్డ్ ఫ్లూ లక్షణాలు కన్పించాయి.