Asianet News TeluguAsianet News Telugu

అమెరికా మహిళపై అత్యాచారం.. రూ.50 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తానంటూ బెదిరింపులు

అమెరికా మహిళపై అత్యాచారం చేసినందుకు గురుగ్రామ్ కు చెందిన ఓ వ్య‌క్తి పై కేసు న‌మోదైంది. త‌నపై అత్యాచారం చేసిన వ్య‌క్తి.. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే వీడియోలు, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని పేర్కొంది. 
 

American woman raped Threatened to post a video on social media if he didn't pay Rs 50 lakh
Author
Hyderabad, First Published Aug 27, 2022, 6:05 PM IST

గురుగ్రామ్: అమెరికాకు చెందిన ఓ మహిళపై అత్యాచారం చేసి, అబార్షన్ చేయించుకోమ‌ని బలవంతం చేయ‌డంతో పాటు రూ. 50 లక్షలు ఇవ్వకపోతే ఆమె వ్యక్తిగత చిత్రాలను, వీడియోల‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు ఓ వ్య‌క్తి. దీనికి సంబంధించి కేసు న‌మోదుచేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. 

42 ఏళ్ల మహిళ బుధవారం తన ఫిర్యాదులో ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో మొత్తం రూ.13 లక్షలు మోసం చేశారన్నారు. అతనితో సంబంధాలు తెగిపోయినప్పుడు, రూ. 50 లక్షలు ఇవ్వకపోతే తన వ్యక్తిగత చిత్రాలను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కాలిఫోర్నియాలో ఉన్న బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఆమె తన 11 ఏళ్ల కుమార్తె చికిత్స కోసం 2014లో భారతదేశానికి వచ్చి గురుగ్రామ్‌లోని సౌత్ సిటీ ప్రాంతంలో నివాస‌మున్నారు. ఆగస్టు-2017లో ఆమె సోషల్ మీడియా ద్వారా యూపీలోని మీరట్ నివాసి సచిన్ కుమార్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే వారి స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డి.. వారిద్దరూ తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు.

సచిన్ తనకు, అతని భార్యకు మధ్య ఉన్న వివాదం గురించి తనతో చెప్పాడని, ఆమె నుండి డబ్బు అడిగాడని ఆమె చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఒక రోజు సచిన్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని, గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని బాధిత మ‌హిళ ఆరోపించింది. తనను మోసం చేసే కుట్రలో కుమార్ తల్లి కాంత ఉపాధ్యాయ్, అతని భార్య సమన్విత హజ్రా కూడా భాగమేనని ఆమె ఆరోపించింది. "మార్చి 2018లో సచిన్ కుమార్ నన్ను బలవంతంగా మద్యం తాగించి, ఆ తర్వాత మత్తులో నాపై అత్యాచారం చేశాడు. అయితే, ఆ త‌ర్వాత దీని గురించి అత‌న్ని నిల‌దీసి, పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తాన‌ని చెప్ప‌గా.. అతను త‌న‌ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. మే 2018లో తాను గర్భవతినని తెలుసుకున్నాను. అయితే, అబార్షన్ చేయించుకోమని సచిన్ కుమార్ త‌న‌పై ఒత్తిడి చేశాడ‌ని పేర్కొంది. త‌న‌ను గుడికి తీసుకెళ్ళి పెళ్లి డ్రామా ఆడాడ‌ని స‌ద‌రు మ‌హిళ త‌న ఫిర్యాదులో పేర్కొంది. 

అలాగే, "అతను నా డెబిట్ కార్డ్, పాస్‌వర్డ్, ఇమెయిల్ పాస్‌వర్డ్ మొదలైనవాటిని తీసుకొని డబ్బును విత్‌డ్రా చేయడం ప్రారంభించాడు. అతను ఇప్పటికీ తన భార్య సమన్వితా హజ్రాతో సుశాంత్ లోక్ ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు నేను షాక్ అయ్యాను" అని ఆమె చెప్పింది. అలాగే, గత ఏడాది అక్టోబర్ 13న సచిన్ త‌న ఇంటికి వచ్చి రూ. 50 లక్షలు డిమాండ్ చేసి త‌న ప్ర‌యివేటు ఫోటోలు, వీడియోలను పబ్లిక్ చేస్తానని బెదిరించాడు. "నేను కాలిఫోర్నియాకు తిరిగి వచ్చినప్పుడు కూడా అతను నాకు ఫోన్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలను తన మొబైల్‌లో నా భర్తతో పంచుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నేను భారతదేశానికి తిరిగి వచ్చాను" అని ఆమె చెప్పింది. ఆమె ఫిర్యాదును అనుసరించి.. స‌చిన్ కుమార్, అతని భార్య,  తల్లిపై IPC, IT చట్టంలోని అనేక సెక్షన్ల కింద అత్యాచారం, బలవంతంగా అబార్షన్ చేయడం, మోసం చేయడం, విషప్రయోగం వంటి అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios