Asianet News TeluguAsianet News Telugu

విదేశీ చదువులకు యువ‌త‌ మొగ్గు.. రికార్డు స్థాయిలో భార‌తీయ విద్యార్థుల‌కు అమెరికా వీసాలు 

భారతీయ విద్యార్థుల‌కు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాల‌ను అమెరికా జారీ చేసింది. 2022 వేస‌విలో 82,000 మంది విద్యార్థుల‌కు స్టూడెంట్ వీసాలు ఇచ్చిన‌ట్లు ఇండియాలోని యూఎస్ మిష‌న్ వెల్ల‌డించింది. 

america issues 82,000 student visas to Indians, highest ever globally in 2022
Author
First Published Sep 9, 2022, 11:06 AM IST

విదేశాల్లో చదువుకోవాల‌నే ఆస్త‌కి భారతీయ‌ యువ‌త‌లో పెరుగుతోంది. ఒక్క‌ప్పుడూ ఉన్న‌త వర్గాల పిల్ల‌లు మాత్రమే..విదేశాల‌కు వెళ్లి చ‌దువుకునే వారు.. కానీ, ప‌లు దేశాల్లో వీసాల జారీ సుల‌భ‌త‌రం కావ‌డంతో.. మధ్యతరగతి విద్యార్థుల‌ సంఖ్య కూడా భారీగా పెరిగింది.  తమ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి తల్లిదండ్రుల్లో చాలా మంది కోరుకుంటున్నారు. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా వారు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకు యుఎస్ మిషన్ వెల్ల‌డించిన గ‌ణాంకాలే సాక్ష్యం. 

ఏడాది భారతీయ విద్యార్థుల‌కు అమెరికా రికార్డు స్థాయిలో వీసాల‌ను జారీ చేసింది. 2022 లో ఇప్ప‌టివ‌ర‌కూ  82,000 మంది  విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు జారీ చేసిన‌ట్టు భారత్ లోని యూఎస్ మిషన్ వెల్ల‌డించింది. గతంలో కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువనీ, భారతీయ విద్యార్థులు ఇతర దేశాల్లో చ‌దువుకోవాల‌ని ఆస‌క్తి చూపుతున్నార‌నీ, అందులో ఎక్కువ మంది అమెరికా  విద్యార్థి వీసాలు పొందార‌ని తెలిపింది. న్యూఢిల్లీ లోని యుఎస్ రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలోని కాన్సులేట్‌లు మే నుండి ఆగస్టు వరకు విద్యార్థుల వీసా దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తాయి, వీలైనన్ని ఎక్కువ మంది విద్యార్థులు తమ అధ్యయన కార్యక్రమాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని యుఎస్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సంద‌ర్భంగా యుఎస్ దౌత్యవేత్త ప్యాట్రిసియా లాసినా మాట్లాడుతూ.. ఈ ఏడాది వేస‌విలో 82,000కు పైగా విద్యార్థి వీసాలు జారీ చేశామని, ఇది గత ఏడాది కంటే చాలా ఎక్కువ అని  చెప్పారు. భారతీయ యువ‌త ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్ ఎంచుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో చ‌దువుతున్న అంత‌ర్జాతీయ విద్యార్థుల్లో 20 శాతం మంది భార‌తీయులేన‌ని తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా  గ‌త రెండేళ్లు వీసా జారీలో  ఆల‌స్యం జ‌రిగింద‌ని, కానీ.. ఈసారి రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు అందించామ‌ని  పాట్రీసియా లాసినా పేర్కొన్నారు. ఇది భారతీయ విద్యార్థుల ముఖ్యమైన సహకారాన్ని కూడా హైలైట్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విద్యార్థులు అంతర్జాతీయ భాగస్వామ్యాలను నిర్వహించడానికి, అభివృద్ధి చేయడానికి అమెరికన్ సహచరులతో జీవితకాల సంబంధాలను ఏర్పరుస్తారని తెలిపారు. 


అదే సమయంలో మరో అధికారి డాన్ హెఫ్లిన్ మాట్లాడుతూ, అమెరికా దౌత్యానికి అంతర్జాతీయ విద్యార్థుల చైతన్యం ప్రధానమని, భారతదేశంలో కంటే విద్యార్థుల సహకారం ఎక్కడా లేదని అన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. యుఎస్‌లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 20 శాతం మంది భారతదేశానికి చెందినవారేన‌ని తెలిపారు.

2021లో విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. 2020-21 విద్యా సంవత్సరంలో భారతదేశానికి చెందిన 167,582 మంది విద్యార్థులు అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం వ‌స్తార‌ని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా.. అమెరికా.. అంతర్జాతీయ విద్యార్థులకు తన తలుపులు తెరిచి ఉంచింద‌నీ,  అమెరికా ప్రభుత్వం, ఉన్నత విద్యా సంస్థలు 2020 సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం అనేక ముఖ్యమైన చర్యలను అమలు చేశామ‌ని నివేదిక వెల్ల‌డించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios