Asianet News TeluguAsianet News Telugu

అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయింది.. పేషెంట్ మరణించాడు

రాజస్తాన్‌లో పేషెంట్‌ను తీసుకెళ్లుతున్న ఓ అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది. దీంతో అంబులెన్స్ దారి మధ్యలోనే ఆగిపోయింది. అందులోని పేషెంట్ మరణించారు. ఈ ఘటనను ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించారు.
 

ambulance run out of fuel, patient died in rajasthan
Author
First Published Nov 26, 2022, 8:15 PM IST

న్యూఢిల్లీ: ఓ పేషెంట్‌ను హాస్పిటల్ తీసుకెళ్లుతుండగా అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది. దీంతో దారి మధ్యలోనే అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఆలస్యమైంది. పేషెంట్ మరణించారు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనను బన్స్వారా చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డాక్టర్ బీపీ వర్మ వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఫుడ్, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫెర్స్ మంత్రి ప్రతాప్ కచరియవాస్ వివరించారు.

అంబులెన్స్ వాహనం ఇంధనం లేక ఆగిపోవడంతో ఆ పేషెంట్ బంధువులు వెహికిల్‌ను వెనక నుంచి నెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధఇంచిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

Also Read: అంబులెన్స్ లో రూ.25 కోట్లకు పైగా దొంగనోట్లు.. అనుమానం రాకుండా తరలిస్తూ, పట్టుబడి...

ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని సీఎంహెచ్‌వో వివరించారు. ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టామని తెలిపారు. బాధితుల బంధువులను కలుస్తామని, ఘటనలో ఏదైనా నిర్లక్ష్యం ఉన్నదేమో అని తెలుసుకుంటామని వివరించారు. అయితే, ఆ అంబులెన్స్ ప్రైవేట్ యాజమాన్యానికి చెందినదని తెలిపారు. ఒక వేళ అంబులెన్స్ ప్రైవేట్ ఓనర్లది అయితే.. అందులో ఇంధనం అయిపోవడమనే సమస్య వారికి మాత్రమే చెందుతుందని, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios