తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి దగ్గర అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ మారుస్తుండగా ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన తోటి సిబ్బంది వాటిని అక్కడి నుంచి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.