దేశ రాజధాని ఢిల్లీలో పలువురు దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమెజాన్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్న ఒకరు మరణించగా.. మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేకెత్తించాయి. ఈ ఘటనలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న 36 ఏళ్ల హర్ ప్రీత్ గిల్ దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృష్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి. భజన్ పురాలోని సుభాష్ విహార్ ప్రాంతంలో హర్ ప్రీత్ గిల్ అమెజాన్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడే ఆయన మేనమామ కూడా అదే ప్రాంతంలో ఉంటూ ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ మంగళవారం రాత్రి సమయంలో ఎక్కడికో బైక్ పై వెళ్లి తిరిగి 11.30 గంటల సమయంలో భజన్ పురా ప్రాంతానికి చేరుకున్నారు.
వారిద్దరిపై బైక్ పై వచ్చిన దుండగులు పలువురు దుండుగులు కాల్పులు జరిపారు. దీంతో గిల్ తల కుడి వైపు నుంచి చెవి వెనుక భాగంలోకి బుల్లెట్ ప్రవేశించి వెళ్లిపోయిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. ఈ ఘటనలో అతడి మేనమామ కూడా గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికులు జగ్ ప్రవేశ్ చంద్ర హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే గిల్ మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు.
కాగా.. తనపై తనపై, తన మేనల్లుడిని ఐదుగురు దుండగులు కాల్చిచంపారని మృతుడి మేనమామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ప్రస్తుతం అతడు లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దాడి చేసిన వారిని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
