అయోధ్యలో మట్టి దీపాలు మిరిమిట్లు గొలిపాయి. 15.76 లక్షల దీపాలతో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేలాది సంఖ్యలో జనం తరలివచ్చారు.
అయోధ్యంలో అద్భుతం కనిపించింది. దీపోత్సవ వేడుకల చివరి రోజున రామ్ కి పైడి 15.76 లక్షల మట్టి దీపాలతో వెలిగిపోయింది. దీంతో అయోధ్య దీపోత్సవం మరో సారి తన రికార్డును తనే బద్దలు కొట్టింది.
Scroll to load tweet…
సరయూ నది ఘాట్‌ల వద్ద మిరుమిట్లు గొలిపే దీపాలను చూపేందుకు వేలాది జనం తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఈ దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తారు.
Scroll to load tweet…
ఈ కార్యక్రమం 2017లో ప్రారంభమైంది. దీనిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వస్తోంది. ఐదేళ్ల కిందట ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మట్టి దీపాలు వెలిగించడం ప్రత్యేకత. ఇదే ఈ దీపావళి వేడుకల్లో ప్రధాన భాగం.
Scroll to load tweet…
చరిత్ర సృష్టించే ఈ వేడుకలను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఇతర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
Scroll to load tweet…
