Asianet News TeluguAsianet News Telugu

బాబా క్షేమంగా వున్నారు : అమర్త్యసేన్ మరణవార్తను ఖండించిన కుమార్తె

 అమర్త్యసేన్ క్షేమంగానే వున్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ స్పష్టం చేశారు. ఆయన హార్వర్డ్‌లో వారానికి 2 కోర్సులు బోధిస్తున్నారు. తన జెండర్ పుస్తకంపై పనిచేస్తూ.. ఎప్పటిలాగే బిజీగా వున్నారు’’ అంటూ నందన పేర్కొన్నారు. 

Amartya Sen's daughter Nandana Deb Sen denies death rumours ksp
Author
First Published Oct 10, 2023, 6:14 PM IST

ప్రఖ్యాత ఆర్ధిక వేత్త, నోబెల్ అవార్డ్ గ్రహీత అమర్త్యసేన్ కన్నుమూసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అమర్త్యసేన్ క్షేమంగానే వున్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘మిత్రులారా మీ ఆందోళనకు ధన్యవాదాలు. కానీ ఇది ఫేక్ న్యూస్ , బాబా పూర్తిగా క్షేమంగా వున్నారు. మేము కేంబ్రిడ్జ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి అద్భుతమైన వారాన్ని గడిపాము. ఆయన హార్వర్డ్‌లో వారానికి 2 కోర్సులు బోధిస్తున్నారు. తన జెండర్ పుస్తకంపై పనిచేస్తూ.. ఎప్పటిలాగే బిజీగా వున్నారు’’ అంటూ నందన పేర్కొన్నారు. 

కాగా.. 1933 నవంబర్ 3న పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో జన్మించిన అమర్త్యసేన్ ఢాకాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1947లో దేశ విభజన తర్వాత భారత్‌కు వచ్చిన ఆయన విశ్వభారతి, ప్రెసిడెన్సీ కాలేజీలలో చదువుకున్నారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్, 1959లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అమర్త్యసేన్‌కు ముగ్గురు భార్యలు నవనీతదేవ్ సేన్, ఇవా కలోర్ని, ఎమ్మా జార్జిన రూత్‌చైల్డ్స్.. వీరికి అంతర సేన్, నందనా సేన్, ఇంద్రాణీ , కబీర్‌ .  అమర్త్యసేన్‌కు 1998లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1999లో భారత అత్యున్న పురస్కారం భారతరత్న ఆయనను వరించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios