Amarnath Cloudburst : కొనసాగుతున్న రెస్క్యూ.. 15,000 మందిని రక్షించిన సిబ్బంది.. 40 మంది గల్లంతు
అమరనాథ్ యాత్రలో ఆకస్మికంగా సంభవించిన వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. దాదాపు 15 వేల మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అమర్‌నాథ్ గుహ సమీపంలో ప్రకృతి సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ ఆకస్మిక వరద ఒక్క సారిగా భక్తులను ఇబ్బందుల్లో ముంచెత్తింది. అనేక మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది యాత్రికులను అమర్‌నాథ్ పవిత్ర గుహ పుణ్యక్షేత్రం దగ్గర నుంచి సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే మరో 40 మంది వరకు గల్లంతయ్యారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
దిగువ అమర్‌నాథ్ గుహ ప్రదేశంలో వరద ప్రభావిత ప్రాంతంలో తప్పిపోయిన వ్యక్తుల కోసం భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)లో దాదాపు 75 మందితో కూడిన మూడు బృందాలు ఉన్నాయని ఒక అధికారి తెలిపారు.
తోటి విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్.. ముగ్గురు పదో తరగతి విద్యార్తులు అరెస్ట్...
గాయపడిన యాత్రికులకు ఐటీబీపీ దళాలు ప్రథమ చికిత్స అందిస్తున్నాయి. వీరిని పవిత్ర గుహ నుంచి పంచతర్ణికి పంపిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి సురక్షితంగా బయటపడ్డ యాత్రికులు.. తాము గుడారాల్లో ఉన్నప్పుడు సంభవించిన విపత్తు, ఆ సమయంలో ఎదుర్కొన్న భయంకర అనుభవాలను వివరించారు. క్లౌడ్‌బర్స్ట్ ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని పండళ్లు కూడా దెబ్బతిన్నాయని యాత్రికులు తెలిపారని ‘ఎన్ డీటీవీ’ నివేదించింది.
‘‘ మేఘాల పేలుడు సంభవించిన 10 నిమిషాల వ్యవధిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వరద నీరు తనతో పాటు పెద్ద సంఖ్యలో రాళ్లను కూడా తీసుకొచ్చింది. ఈ యాత్ర కోసం అనేక మంది వస్తూనే ఉన్నారు. భారీ వర్షాలు ఉన్నప్పటికీ ఇంకా వస్తున్నారు.’’ అని ఒక యాత్రికుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కి చెందిన యాత్రికుడు దీపక్ చౌహాన్ ANIతో మాట్లాడుతూ ‘‘ వరదల సమయంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సైన్యం చాలా సపోర్ట్ ఇచ్చింది. నీటి కారణంగా చాలా పండాలు కొట్టుకుపోయాయి. ’’ అని తెలిపారు.
పరిస్థితి అదుపులోనే ఉందని, వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయని ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే తెలిపారు. ప్రమాద స్థాయిని పరిశీలించి, అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా వేశారని చెప్పారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ వరదలు సంభవించిన ప్రాంతంలో 25 గుడారాలు, యాత్రికులకు ఆహారం అందించే మూడు కమ్యూనిటీ కిచెన్‌లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పవిత్ర గుహ వద్ద ఉన్న ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం ప్రకారం ఈ ప్రాంతంలో సాయంత్రం 4:30 నుండి 6:30 గంటల వరకు 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Shinzo Abe Assassination : షింజో అబే మరణం.. నేడు భారత జాతీయ సంతాప దినంగా ప్రకటించిన కేంద్రం
ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర బలగాలు, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ త్వరగతిన సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేసింది. 43 రోజుల అమర్‌నాథ్ యాత్ర మూడేళ్ల విరామం తర్వాత జూన్ 30న ప్రారంభమైంది. 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధనలను కేంద్రం రద్దు చేయడంతో యాత్రను మధ్యలోనే రద్దు చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020, 2021లో తీర్థయాత్ర జరగలేదు.