నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్‌ పెంపును వెల్లడించింది. అత్యవసర మెడిసిన్స్ జాబితాలోని సుమారు 800 షెడ్యూల్డ్ మెడిసిన్‌లపై వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10.7 శాతం ధరలు పెంచనున్నట్టు ఆ ప్రకటన సారాంశం ఉన్నది. 

న్యూఢిల్లీ: జ్వరం వచ్చిందంటే వెంటనే గుర్తుకొచ్చే ట్యాబ్లెట్ ప్యారాసెటమాల్. ఇలా కొన్ని తరుచుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ట్యాబ్లెట్ల పేర్లు చాలా మంది నోటిలో నానుతూనే ఉంటాయి. వైద్యుడి వద్దకు వెళ్లకుండానే ఇలాంటి కచ్చితమైన ట్యాబ్లెట్లు కొనుక్కోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. అయితే, ఈ ట్యాబ్లెట్ల ధరలు పెరగనున్నాయి. ఔను.. అందరికీ తెలిసిన ప్యారాసెటమాల్, అజిత్రోమైసిన్ సహా 800 రకాల అత్యవసర మెడిసిన్స్ రేట్లు 10 శాతం పెరుగుతున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం కీలక ప్రకటన చేసింది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ను 10.76607శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. అంటే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎస్సెన్షియల్ మెడిసిన్స్‌లోని సుమారు 800 షెడ్యూల్డ్ మెడిసిన్‌లపై ఈ పెంపు ఉండనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10.7 శాతం ధరలు పెరగనున్నాయి.

జ్వరం, ఇన్ఫెక్షన్స్, గుండె సమస్యలు, హై బీపీ, చర్మ వ్యాధులు, అనీమియా వంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే మెడిసిన్స్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే, ప్యారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనైటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనైడజోల్ వంటి డ్రగ్స్ ధరలు పెరుగుతున్నట్టు స్పష్టం అవుతున్నది.

టాబ్లెట్లను వేసుకునే పద్దతులు కొన్ని ఉంటాయి. వాటి ప్రకారం వేసుకోకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా టాబ్లెట్లను ఎప్పుడూ చల్లని లేదా వేడి నీళ్లతో అస్సలు వేసుకోకూడదు. కొంతమందైతే .. ఏకంగా కూల్ డ్రింక్స్ తో మందు బిల్లలను మింగుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలా వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో కూడా వివరించింది. సాధారణ ఉష్ణోగ్రత అంటే గది ఉష్ణోగ్రత వద్ద మందుబిల్లలను మింగితే అవి టైం ప్రకారమే కరుగుతాయట. ఒకవేళ కూల్ డ్రింక్స్ తో మాత్రలను వేసుకుంటే అవి కరగడానికి ఏకంగా 40 నిమిషాల టైం పడుతుందట. అంటే ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువ టైం కరగడానికి తీసుకుంటుందన్న మాట. ఈ లెక్కన చూస్తే.. మనం వేసుకునే టాబ్లెట్లు లివర్ గుండానే లోపలికి వెళతాయి. ఇవి Blood flow లో కలిసే కంటే ముందుగానే మన కడుపులోని ఆమ్లాల ద్వారా కరగాల్సి ఉంటుంది. అయితే చల్లని నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ తో మందుబిల్లలను మింగితే.. ఇవి ఆమ్లాలతో కలిసే ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది.