Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్‌.. అది రాహుల్ గాంధీ పాలన నమునా.. అలోక్ భట్ ఫైర్.. ఇదే బీజేపీ సీఎం చేసి ఉంటే..

రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు వరకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌పై నిషేదం విధించారు. అయితే ఇలా చేయడంపై పలువురు నెటిజన్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Alok bhatt Fires On Congress And rahul gandhi over internet ban in Rajasthan just to conduct an entrance
Author
New delhi, First Published Oct 28, 2021, 1:45 PM IST

రాజస్తాన్‌లో మరోసారి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలివేశారు. రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు వరకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్‌పై నిషేదం (internet ban) విధించారు. పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు, చీటింగ్, కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఇలా చేయడంతో కొందరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతకుమందు.. శని, ఆదివారాల్లో పట్వారి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ సందర్బంగా రాజస్తాన్ (Rajasthan) జైపూర్‌తో పాటుగా బికనేర్, దుస్సా.. వంటి పలు జిల్లాలో 12 గంటలు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. గత నెలలో కూడా రాజస్తాన్ టీచర్స్ అర్హత పరీక్ష సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

అయితే ఇలా చేయడంపై పలువురు నెటిజన్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ఫాలోవర్స్ మాత్ర ఇదేనా కాంగ్రెస్‌ దృష్టిలో ప్రజస్వామ్యం అంటే అని ప్రశ్నిస్తున్నారు.  ‘రాజస్థాన్‌లో ఇంటర్నెట్‌ను నిషేధించడం కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం.. కానీ కశ్మీర్‌లో CAA వ్యతిరేక నిరసనల సమయంలో, లఖింపూర్ హింస సమయంలో, ఈశాన్య రాష్ట్రాల్లో హింస సమయంలో ఇంటర్నెట్ నిషేధించడం అప్రజాస్వామికం’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

 

వృతిరీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్ అయిన అలోక్ భట్ కూడా ఇదే విషయంలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ భద్రత సమస్యలప్పుడు (ఆర్టికల్ 370 రద్దు తర్వాత) కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం విధించలేదని అన్నారు. కానీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్టీకి చెందిన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం రాజస్తాన్‌లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఇంటర్నెట్ బ్యాన్ చేస్తోందని విమర్శించారు.

 

కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష సమయంలో చేసినట్టుగా.. బీజేపీ ముఖ్యమంత్రి‌ ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసి ఉంటే మీడియా ఆగ్రహాన్ని ఊహించుకోండి అంటూ..  Alok Bhatt ట్వీట్ చేశారు. రాజస్తాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్‌, అక్కడి ప్రజల ఇబ్బందులపై మీడియాలో వచ్చిన పోస్ట్‌లను సైతం ఆయన షేర్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios