ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతినివ్వండి.. సీజేఐకి మహిళా జడ్జి బహిరంగ లేఖ...

గతంలో బారాబంకిలో పోస్టింగ్‌లో ఉన్న సమయంలో జిల్లా జడ్జి, అతని సహచరులు వేధింపులకు గురిచేశారని ఓ మహిళా జడ్జ్ ఆరోపించారు. ఈ బాధ తట్టుకోలేక పోతున్నానని ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి కోరుతూ మహిళ నిన్న ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.

Allow to commit suicide, Woman judge's open letter to CJI - bsb

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా జడ్జి తనపై సీనియర్‌ జడ్జ్ ఆయన సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ దీనిమీద నివేదిక ఇవ్వాలని కోరారు.

"నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి నన్ను అనుమతించండి. నా జీవితం అంతం చేసుకోనివ్వండి" అని బండాకు చెందిన మహిళా న్యాయమూర్తి చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. బారాబంకి జిల్లా జడ్జి, అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది.  "నేను చాలా లైంగిక వేధింపులకు గురయ్యాను. నన్ను పూర్తిగా చెత్తలాగా చూసారు. నన్ను నేను పనికిరాని కీటకంగా భావిస్తున్నాను" అని సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖలో పేర్కొంది. 

Year Ender 2023 : ఈ సంవత్సరం అత్యంత వివాదాస్పదమైన అంశాలు ఇవే...

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సూచనల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాస్తూ మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులన్నింటిపై గురువారం ఉదయానికి నివేదిక ఇవ్వాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ బహిరంగ లేఖపై దృష్టి పెట్టిన్లు.. నిన్న రాత్రి సెక్రటరీ జనరల్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు.

జూలై 2023లో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసిన తర్వాత తన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించామని, అయితే విచారణ "ప్రహసనంగా సాగిందని.. అంతా బూటకం" అని మహిళా న్యాయమూర్తి తన లేఖలో పేర్కొన్నారు. "విచారణలో ఉన్న సాక్షులు జిల్లా జడ్జి తక్షణ సబార్డినేట్‌లు. అలాంటి సాక్షులు తమ బాస్‌కి వ్యతిరేకంగా ఎలా చెబుతారని కమిటీ భావిస్తుందో నాకు అర్థం కాలేదు" అని ఆమె రాసింది.

న్యాయమైన విచారణ జరిగేలా చూడాలని, విచారణ పెండింగ్‌లో ఉన్న న్యాయమూర్తిని బదిలీ చేయాలని తాను అభ్యర్థించానని, అయితే తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు "కేవలం ఎనిమిది సెకన్లలో" కొట్టివేసిందని ఆమె అన్నారు. "విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో జిల్లా జడ్జిని బదిలీ చేయాలని నేను అభ్యర్థించాను. కానీ, నా కనీస ప్రార్థనను పట్టించుకోలేదు" అని లేఖలో పేర్కొన్నారు.

"నాకు ఇక బతకాలనే కోరిక లేదు. గత ఏడాదిన్నరగా నన్ను నడిరోడ్డుపై నిలబెట్టారు. ప్రాణం లేని, నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇకపై మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితం వృధా అయిపోయింది" అని రెండు పేజీల లేఖలో పేర్కొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios