సారాంశం

విపక్ష కూటమికి చెందిన పార్టీలు  రానున్న రోజుల్లో ముంబైలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రకటించారు 

బెంగుళూరు: విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశామన్నారు.  ఇండియా (INDIA) అంటే ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లూజివ్ అలయెన్స్ అని  ఖర్గే వివరించారు. 

రెండు రోజుల పాటు  బెంగుళూరులో  విపక్ష పార్టీల సమావేశం జరిగింది. మంగళవారంనాడు సాయంత్రం ఈ సమావేశం ముగిసింది.ఈ రెండు  రోజుల పాటు  ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను  మల్లికార్జున ఖర్డే మీడియాకు  తెలిపారు.

ఈ పేరుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించారని ఖర్గే చెప్పారు.దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమన్నారువిపక్ష పార్టీల  సమావేశంలో  26 పార్టీలకు చెందిన  నేతలు పాల్గొన్నారని ఖర్గే తెలిపారు. తదుపరి సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నామన్నారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు  చేసినట్టుగా  ఆయన  చెప్పారు.   ఈ కూటమి క్యాంపెయిన్  మేనేజ్ మెంట్ కోసం  ఢిల్లీలో  సెక్రటేరియట్ ను ఏర్పాటు  చేస్తున్నామన్నారు. 

also read:విపక్షాల కూటమికి కొత్త పేరు ‘INDIA’ .. అర్ధం ఏంటంటే, మరి సారథి ఎవరు.. వివరాలివే..!!

బీజేపీ ప్రభుత్వం  ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.  సీబీఐ, ఈడీలతో విపక్ష నాయకులపై  ఈడీతో దాడులు చేయిస్తుందని ఆయన ఆరోపించారు.  దేశ ప్రయోజనాల పరిరక్షణకు  అందరూ కలిసికట్టుగా  ఉండాలని ఆయన కోరారు. పాట్నా సమావేశానికి  16 పార్టీలు హాజరైతే  ఇవాళ సమావేశానికి  26 పార్టీలు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. ఎన్డీఏ సమావేశానికి  38 పార్టీలు హాజరౌతున్నట్టు చెబుతున్నారన్నారు. ఈసీ గుర్తించిన పార్టీలు  వస్తున్నాయా లేదా అనేది తెలియదని  ఖర్గే సెటైర్లు వేశారు. పేరు, గుర్తింపు లేని పార్టీలతో ఎన్డీఏ సమావేశమౌతుందన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో  విపక్ష పార్టీల మధ్య విబేధాలున్నాయన్నారు. అయితే  ఈ విబేధాలను పక్కన పెట్టాలని కూడ నిర్ణయం తీసుకున్నట్టుగా  ఖర్గే వివరించారు.దేశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో అందరం కలిసి కట్టుగా  పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని  మల్లికార్జున ఖర్గే చెప్పారు.

కూటమి నేత ఎవరనేది  ముంబై సమావేశంలో ప్రకటిస్తామని  మల్లి కార్జున ఖర్గే  ప్రకటించారు.  సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను కూడ ఈ సమావేశంలో ప్రకటించనున్నట్టుగా ఆయన తెలిపారు.