హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. 

ఓ మహిళా కోచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. అయితే ఈ ఆరోపణలు మంత్రి ఖండించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

నాసిక్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు..

తనపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు క్రీడా మంత్రి సందీప్ సింగ్ అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి క్రీడా శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. తన పరువును చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఫిర్యాదుదారు చేసిన మహిళ ఆరోపణలు, చరిత్రపై సమగ్ర దర్యాప్తు జరగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని, విచారణ నివేదిక వచ్చే వరకు క్రీడా శాఖ బాధ్యతలను సీఎంకు అప్పగిస్తున్నానని చెప్పారు.

Scroll to load tweet…

కాగా.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రిపై నిష్పక్షపాత విచారణ జరపాలని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా డిమాండ్ చేశాడు. సందీప్ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఇదిలా ఉండగా.. హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. ఏదో పని నిమిత్తం ఆయన వద్దకు వెళ్లిన సమయంలో తనపై ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొంది. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో మంత్రి తన టీ షర్టును చింపాడని కూడా ఆమె ఆరోపించింది.

Scroll to load tweet…

మంత్రిపై ఫిర్యాదు చేసిన మహిళ హర్యానాలో జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా ఉన్నారు. సందీప్ సింగ్ తనను మొదట జిమ్‌లో చూశాడని, తరువాత తనను ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదించాడని ఆమె ఆరోపించింది. తనను కలవాలని పట్టుబట్టాడని తెలిపారు. ‘‘ఆయన నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు. నా నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో కలవాలనుకుంటున్నానని చెప్పాడు. దురదృష్టవశాత్తు నా సర్టిఫికేట్ విషయంలో కొంచెం సమస్య ఉంది. దీని కోసం నేను సంబంధిత అధికారులను సంప్రదించాను’’ అని ఆమె పేర్కొన్నారు. 

జ‌న‌వరిలో సాధార‌ణం కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు.. చ‌లి తీవ్ర‌త అధిక‌మే.. : ఐఎండీ

తన వద్ద ఉన్న మరి కొన్ని పత్రాలతో సందీప్ సింగ్‌ను కలవడానికి ఆయన క్యాంపు ఆఫీసుకు వెళ్లానని ఆమె తెలిపింది. అక్కడికి వెళ్లగానే మంత్రి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘ నన్ను ఆయన నివాసంలోని ఓ పక్క క్యాబిన్‌కి తీసుకెళ్లి.. నా డాక్యుమెంట్లను సైడ్ టేబుల్‌పై ఉంచి, నా కాలు మీద చేయి వేశాడు. నన్ను మొదటిసారి చూసినప్పుడు ఇష్టపడ్డానని చెప్పాడు. నన్ను సంతోషంగా ఉంచితే, నేను నిన్ను సంతోషంగా ఉంచుతానని చెప్పాడు. కానీ నేను అతడి చేతిని తీసివేశాను. దీంతో అతడు నా టీ-షర్టును చింపివేశాడు. నేను ఏడ్చాను. సహాయం కోసం అరిచాను. ఆ సమయంలో ఆయన సిబ్బంది అంతా అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ సహాయం చేసేందుకు రాలేదు. ’’ అని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.