Asianet News TeluguAsianet News Telugu

వివాహితతో సహజీవనం చట్ట వ్యతిరేకం : హైకోర్టు

ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ వ్యాఖ్య చేసింది. 

Allahabad High Court refuses to grant protection to married woman in live-in relationship - bsb
Author
Hyderabad, First Published Jun 18, 2021, 9:33 AM IST

ఓ వివాహిత మరొక వ్యక్తితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్ మీద ఈ వ్యాఖ్య చేసింది. 

ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ ను కొట్టివేసిన జస్టిస్ కౌశల్ జయేంద్ర ఠాకెర్, జస్టిస్ దినేష్ పాఠక్ లతో కూడిన ధర్మానసం వారికి రూ. 5000 జరిమానా విధించింది. 

రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టం పరిధిలో ఉండాలని తెలిపింది. సమాజంలో చట్ట వ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్ ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది. భర్త నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండి ఉంటే మొదట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొంది.

కానీ అలా జరగలేదని తెలిపింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సహజీవనానికి అనుమతించలేమని స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios