జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు సముదాయంలోని శివలింగం వంటి నిర్మాణాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని ధర్మాసనం భారత పురావాస్తు శాఖను ఆదేశించింది.

దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు సముదాయంలోని శివలింగం వంటి నిర్మాణాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని ధర్మాసనం భారత పురావస్తు శాఖను ఆదేశించింది. సదరు శివలింగం ఎన్నాళ్ల నాటిది.. అది నిజంగా శివలింగమా కాదా అన్న విషయాన్ని శాస్త్రీయ సర్వే ద్వారా నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ద్వారా శివలింగాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలన్న డిమాండ్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.