D-Voters: ఓటు హక్కు ఉన్నా.. ఓటు వేయలేరు.. ఇంతకీ వారెవరు?  

D-Voters: దేశంలో నివసిస్తున్నా.. ఓటు హక్కు ఉన్నా.. కొంతమంది ఓటు వేయలేరు. అలాంటి వారెవరు? వారు తమ ఓటు హక్కును ఎందుకు ఉపయోగించుకోలేరు? వారి గురించి తెలుసుకుందాం.. 

All You Need To Know About D-Voters: Who They Are And Do They Have Voting Rights KRJ

D-Voters: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశపోలింగ్ మే 13న జరగనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఓటర్లు ఓటు వేయనున్నారు. దేశంలో అనేక రకాల ఓటర్లు ఉన్నారు. సాధారణ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, NRI ఓటర్లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొంతమందికి ఓటు హక్కు ఉన్నా ఓటు వేయని వర్గం కూడా ఉంది. వీరినే డి - ఓటర్లు అంటారు. డౌట్‌ఫుల్ అనే పదాన్ని డి-ఓటర్‌కు కూడా ఉపయోగిస్తారు. అందుకే వారిని సందేహాస్పద ఓటర్లు అని కూడా అంటారు. ఇంతకీ వారు ఎందుకు ఓటు వేయరు ఇప్పుడు తెలుసుకుందాం. 

డి-ఓటర్లు అంటే ఎవరు ?

సరళమైన భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయిన ఓటర్లు వీరే. పౌరసత్వాన్ని రుజువు చేయడంలో వారు సందేహాస్పదంగా ఉన్నారు.   2015 సంవత్సరంలో మహీంద్రా దాస్ అనే వ్యక్తిని D-ఓటర్‌గా ప్రకటించారు. తరువాత 2019 సంవత్సరంలో, ఫారినర్స్ ట్రిబ్యునల్ మహీంద్రాను విదేశీయుడిగా ప్రకటించింది. అస్సాం ప్రభుత్వ లెక్కల ప్రకారం వారి రాష్ట్రంలో ఇలాంటి వారి సంఖ్య సుమారు లక్ష. వీరి పౌరసత్వం పై భారత ప్రభుత్వానికి సందేహాలు ఉన్నాయి. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఎఎ) సమస్య ఉన్నట్లే, డి-ఓటర్ కూడా ఒక సమస్య.

ఎప్పుడు, ఎలా ప్రకటించారు ?

1997లో భారత ఎన్నికల సంఘం విదేశీ పౌరులను గుర్తించేందుకు ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద వారు పౌరసత్వం వివాదంలో ఉన్న లేదా అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వం 1971 మార్చి 24గా తేదీని నిర్ణయించింది. ఈ తేదీకి ముందు భారతదేశానికి వచ్చిన వారిని చట్టబద్ధమైన పౌరులు అని పిలుస్తారు. తర్వాత వచ్చిన వారిని అక్రమ పౌరులు అని పిలుస్తారు. ఈ తేదీని పెట్టేందుకు కారణం బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధం.

డి - ఓటర్లను ఎవరు ప్రకటించారు ?

భారతదేశంలో ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే అధికారం ఫారినర్స్ ట్రిబ్యునల్‌కు ఉంది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఉత్తర్వును భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ 1964లో ఆమోదించింది. ఈ ట్రిబ్యునల్ కింద, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లా మేజిస్ట్రేట్‌కు ఒక వ్యక్తి భారతదేశంలో చట్టబద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా నివసిస్తున్నాడో లేదో నిర్ణయించే అధికారం ఇచ్చారు. దీని ఆధారంగా అతను భారతీయుడిగా, విదేశీయుడిగా గుర్తింపుపొందాడు. ఈ ట్రిబ్యునల్ పాక్షిక - న్యాయ సంస్థ.

సమస్య ఓటుకు మించినది..

ఈ డి - ఓటర్లు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయలేరు. అయితే ఈ సమస్య ప్రజలు ఓటు వేయకపోవడమే కాదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందని వారు కూడా ఇందులో ఉన్నారు. పేదరికం, లేమితో జీవిస్తున్న ఈ ప్రజలు ఆర్థిక, సామాజిక కష్టాలతో పోరాడుతూనే ఉన్నారు. దీని కారణంగా వారు నివసించే రాష్ట్ర ప్రాంతంలో అసమానత, పేదరికం సమస్య తలెత్తుతుంది. ఈ అంశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios