Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. స్వదేశీ గన్స్ సెల్యూట్, అగ్నివీర్స్, అల్ ఉమెన్ బృందం.. ఇవన్నీ తొలిసారే..!

భారతదేశం ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌ ఈసారి పలు ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. 

All Women Contingent to Agniveers many firsts of Republic day parade
Author
First Published Jan 26, 2023, 3:14 PM IST

భారతదేశం ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌ ఈసారి పలు ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. కర్తవ్యపథ్‌లో తొలిసారి నిర్వహించి పరేడ్‌లోని త్రివిధ దళాలు సత్తా చాటాయి. అబ్బురమైన విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక పురోగతి, బలమైన అంతర్గత, బాహ్య భద్రతను వర్ణించే మొత్తం 23 శకటాలను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. కార్యక్రమాన్ని అలంకరించాయి. ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 17  శకటాలతో పాటు.. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి 6 శకటాలు ఉన్నాయి. 

మొత్తం మేడ్-ఇన్-ఇండియా ఆయుధాల అద్భుతమైన ప్రదర్శన, సాయుధ దళాలలో 'నారీ శక్తి' పాత్ర పెరగడం, భారత్ వలస గతాన్ని విడిచిపెట్టిన సంకేతాలను స్పష్టంగా పంపింది. కొత్తగా రిక్రూట్ అయిన అగ్నివీర్స్ కూడా కవాతులో భాగం అయ్యారు. ప్రధాన యుద్ధ ట్యాంకులు అర్జున్ ఎంకే-1,  కే-9 వజ్ర స్వీయ చోదక హోవిట్జర్ గన్స్, బీఎంపీ, ఆకాష్ క్షిపణులు, బ్రహ్మోస్, నాగ్ వంటి దాదాపు అన్ని ఆయుధ వ్యవస్థలను స్వదేశీంగా తయారు చేసినందున ఈ సంవత్సరం కవాతు ‘‘ఆత్మనిర్భర్ భారత్’’పై దృష్టి సారించింది.ఈ గణతంత్ర వేడుకల్లో తొలిసారి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు..
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈజిప్టు సైన్యానికి చెందిన 144 మంది సైనికులు కూడా కవాతులో పాల్గొన్నారు. ఈజిప్టు ఆర్మీకి చెందిన 12 మంది సభ్యుల బ్యాండ్ కూడా కవాతులో పాల్గొంది.

రాష్ట్రపతికి స్వదేశీ 21-గన్ సెల్యూట్..
ఈ గణతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ కాలం నాటి 25 పౌండర్ ఫిరంగుల స్థానంలో స్వదేశీ ఫీల్డ్ గన్‌లు వచ్చాయి. మొదటి గణతంత్ర దినోత్సవం నుంచి గతేడాది వరకు ప్రతి గణతంత్ర దినోత్సవం రోజున బ్రిటీష్ కాలం నాటి 25-పౌండర్ ఫిరంగి నుంచి రాష్ట్రపతికి 21 గన్ సెల్యూట్ ఉండేది. అయితే ఈసారి స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించాయి. 

తొలి ప్యాసింజర్ డ్రోన్
కర్తవ్యపథ్‌లో భారతదేశపు తొలి ప్యాసింజర్ డ్రోన్ మ్యాజిక్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఈ ప్యాసింజర్ డ్రోన్‌కి వరుణ అని పేరు పెట్టారు. దీనిని పూణేలోని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ తయారు చేసింది. భారత నావికాదళం శకటం ఈ ప్యాసింజర్ డ్రోన్‌ను రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించింది. దీనిని త్వరలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు. మూలాల ప్రకారం.. ఈ ప్యాసింజర్ డ్రోన్‌లో ఒకరు ప్రయాణించవచ్చు. ఈ ప్యాసింజర్ డ్రోన్ 130 కిలోల బరువుతో దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత డ్రోన్ గాలిలో 25-33 నిమిషాల పాటు ఉండగలదు.

మొదటి ఒంటెల స్వారీ మహిళా బృందం
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలిసారిగా మగవారితో కలిసి రాజ్‌పథ్ పరేడ్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన దేశంలోని మొట్టమొదటి ఒంటెల స్వారీ మహిళా బృందం పాల్గొంది. ఈ బీఎస్‌ఎఫ్ ఒంటెల స్వారీ మహిళా బృందం రాజస్థాన్ ఫ్రాంటియర్, బికనీర్ సెక్టార్‌లోని శిక్షణా కేంద్రం ద్వారా శిక్షణ పొందింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ఒంటె స్వారీ బృందం.

అల్ ఉమెన్ సీఆర్‌పీఎఫ్ బృందం.. 
కర్తవ్యపథ్ వద్ద జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  అల్ ఉమెన్ సీఆర్‌పీఎఫ్ బృందం మార్చింగ్ కాంటెంజెంట్ గౌరవ వందనం స్వీకరించారు. 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నారీ శక్తి మొత్తం థీమ్‌లో కవాతులో భాగంగా ఈ బృందం చేర్చబడింది. ఈ బృందంలో మొత్తం మహిళలే ఉంటారు.

వీవీఐపీ వరుసలో సామాన్యులు..
ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో మరో ప్రత్యేకత కూడా ఉన్నారు. వీవీఐపీలు కూర్చొనే వరుసలో ఈసారి రిక్షాలను లాగేవారు, మెయింటెనెన్స్ వర్కర్లు, కూరగాయల విక్రేతలు, సెంట్రల్ విస్టాను నిర్మించడంలో సహాయం చేసిన శ్రమజీవిలకు కేటాయించబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios