Asianet News TeluguAsianet News Telugu

బొగ్గుగనిలో వజ్రాలు.. పోటెత్తుతున్న జనాలు..

బొగ్గుగనుల్లో వజ్రాలు దొరికాయన్న వార్తలతో స్థానికులు ఎగబడుతున్నారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని బొగ్గుగనుల్లో జరిగింది. నాగాలాండ్ లో నాణ్యమైన బొగ్గుగనులు అపారంగా ఉన్నాయి. ఈ బొగ్గుగనుల్లో తవ్వకాలు జరుపుతుండగా వజ్రాలు బయటపడ్డాయనే  వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆ బొగ్గుగనుల వద్దకు వెళ్లి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు.

All that glitters : Diamond rush in Nagaland s coal heartland - bsb
Author
Hyderabad, First Published Nov 28, 2020, 11:29 AM IST

బొగ్గుగనుల్లో వజ్రాలు దొరికాయన్న వార్తలతో స్థానికులు ఎగబడుతున్నారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లోని బొగ్గుగనుల్లో జరిగింది. నాగాలాండ్ లో నాణ్యమైన బొగ్గుగనులు అపారంగా ఉన్నాయి. ఈ బొగ్గుగనుల్లో తవ్వకాలు జరుపుతుండగా వజ్రాలు బయటపడ్డాయనే  వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆ బొగ్గుగనుల వద్దకు వెళ్లి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు. 

మోన్ జిల్లా శివారు ప్రాంతంలోని వాంచింగ్ వద్ద ఉన్న బొగ్గుగనిలో ఈనెల 25 వ తేదీన ఓ వ్యక్తికి మెరుస్తూ ఉన్న రాళ్ళూ దొరికాయి. అవి వజ్రాలకు మాదిరిగా ఉండటంతో వార్త బయటకు వచ్చింది. దీంతో ఎక్కడెక్కడినుంచో వచ్చి వాంచింగ్ గ్రామంలో తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమతం అయ్యింది.  అయితే అతనికి దొరికింది వజ్రమేనో కాదో వజ్రాల నిపుణులు పరీక్షించి నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది.  

మెరుస్తూ కనిపిస్తున్న రాళ్లు వజ్రాల లేదంటే క్వార్ట్రజ్ శిలలా అన్నది సందేహంగా మారింది. అయితే, నాగాలాండ్ లోని బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడే అవకాశం ఉందని భూగర్భగని శాస్త్రవేత్తలు కూడా దృవీకరించడంతో ఒక్కసారిగా నాగాలాండ్ లోని వాంచింగ్ గ్రామం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios