Asianet News TeluguAsianet News Telugu

కాల్ సెంటర్‌తో మోసాలు.. ఆరు నెలల్లో రూ. 50 కోట్ల టోకరా

అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్లే లక్ష్యంగా ఓ ముఠా ఆరు నెలల్లో సుమారు రూ. 50కోట్లకుపైగా డబ్బు సంపాదించుకుంది. దేశంలో మూడు చోట్ల నుంచి 80 మంది స్టాఫ్‌తో ఈ కాల్ సెంటర్ నిర్విహిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 1.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారే టోల్ ఫ్రీ నెంబర్లు పంపించి.. తమ నిర్దశిత టోల్ ఫ్రీ నెంబర్లు ఫోన్ చేసేలా చర్యలు తద్వారా వారిని తమ అధీనంలోకి తీసుకుని బురిడీ కొట్టించింది.

all center used for fraud.. seven arrested by hyd police
Author
Hyderabad, First Published Jan 15, 2022, 4:13 AM IST

హైదరాబాద్: కాల్ సెంటర్(Call Centre0 నడుపుతూ అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్ల(Credit Card Holders)ను లక్ష్యంగా చేసుకుని మోసాల(Fraud)కు పాల్పడ్డారు. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియాలకు చెందిన అంతర్జాతీయ క్రెడిట్ కార్డులు ఉన్నవారిని మోసం చేశారు. ఆరు నెలల్లో రూ. 50 కోట్లకు పైగా టోకరా కొట్టారు. మొహలీ, హైదరాబాద్, ఘజియాబాద్‌ల నుంచి సుమారు 80 మందితో ఈ కాల్ సెంటర్ నడిపించారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.11 కోట్ల నగదు, ల్యాప్‌టాప్, ఇతర పరికరాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌లలోని అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్ల వివరాలను ఈ ముఠా సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా వారికి బల్క్ ఎస్ఎంఎస్‌లు, గూగుల్ యాడ్స్, ఈమెయిల్స్ ద్వారా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు పంపించింది. వారి సిస్టమ్‌లోకి మాల్వేర్ ఎక్కించి.. దాన్ని రిమూవ్ చేయడానికి తమను సంప్రదించాలని యాడ్స్ ద్వారా వలలో వేసుకుంది. ఈ మూడు దేశాల్లో వారు మొత్తం ఐదు టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో పెట్టారు. ఆ నెంబర్‌లకు కాల్ చేస్తే.. వారు తాము చెప్పిన ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. ఆ యాప్ డౌన్‌లోడ్ చేశాక.. దాని లింక్ షేర్ చేయాల్సిందిగా ఆదేశిస్తారు. ఆ లింక్ షేర్ చేయగానే.. వారి క్రెడిట్ కార్డు నెంబర్లు, సీవీవీ, ఎక్స్‌పైరీ డేట్‌లను వారు సులువుగా పొందుతారు. ఈ విధంగా వారి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల నుంచి సొమ్ము మాయం చేశారు. 

ఈ మొత్తం వ్యవహారంల నవీన్ బొటాని నిందితుడు కీలక పాత్ర పోషించాడు. ఆయన 2017లో ఆర్ఎన్ టెక్ అనే సర్వీసెస్ కంపెనీని స్థాపించాడు. ఇందులో 80 మందితో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ధిల్లీ, మొహలీ, ఘజియాబాద్‌లో కాల్ సెంటర్లు నడిపాడు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్లే లక్ష్యంగా ఈ పనులు జరిగాయి. విదేశీ క్రెడిట్ కార్డుల కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా రూ. 50 కోట్లకు పైగా మోసాలకు పాల్పడింది. ముఠా బాధితులు వేలల్లో ఉంటారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని వివరించారు. దుబాయ్‌లో రెండు ముఠాలు ఉన్నట్టు గుర్తించినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

ఢిల్లీ కేంద్రంగా అక్రమంగా కాల్‌ సెంటర్‌ నడుపుతూ..  దేశ‌వ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ.. దగాకు పాల్పడింది మరో ఢిల్లీ గ్యాంగ్‌. ఈ గ్యాంగ్ ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన రాజేష్‌ సింగ్‌, అనుభవ్‌సింగ్‌, నఫీజ్‌, సైఫ్‌ అలీ, యోగిత, షాలు కుమారి, ప్రియ, శివానీలు ఒక మఠాగా ఏర్పడి.. మయూర్‌ విహార్‌ పేరుతో ఢిల్లీలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

'షైన్‌.కామ్ అనే    వెబ్‌సైట్ల ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ఉద్యోగం కావాలని రిజిస్ట‌ర్ అయిన వారిని టార్గెట్ చేస్తారు.  వెబ్‌సైట్‌ ఉద్యోగిగా పరిచయం చేసుకుని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజులు, ఇతరత్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాది కాలం నుంచి కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్టు వంద‌లాది మంది నుంచి డబ్బులు వ‌సూల్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios