ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో కూలిన ఎఎన్ 32 విమాన ప్రమాద స్థలం నుండి 13 మృతదేహాలను వెలికితీశారు. కూలిన విమానం బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని లిపోకి 16 కి.మీ దూరంలో భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్-32 విమానం కూలిపోయింది. ఈ విమానం శకలాలను ఎంఐ-17 విమానాలు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులకు కూడ సమాచారం  ఇచ్చారు.  హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలకు స్వస్థలాలకు తరలించనున్నారు.

ఈ నెల 3వ తేదీన ఐఎఎఫ్ ఎఎన్-32 విమానం టేకాఫ్ అయిన 33 నిమిషాల అనంతరం కూలిపోయింది. అస్సాంలోని జొర్హాత్ నుండి మధ్యాహ్నం 12.27 గంటలకు టేకాఫ్ అయిన విమానం అదృశ్యమైంది. ఈ విమానం కూలిపోయిందని రెండు రోజుల క్రితం గుర్తించారు.  

 మారింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. సంఘటన స్థలం నుండి  మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు.