వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే భారీ కుట్ర.. ఏం జరిగిందంటే..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు చేసిన కుట్ర భగ్నం అయింది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు చేసిన కుట్ర భగ్నం అయింది. వందేభారత్ రైలు పట్టాలు తప్పేలా రైల్వే ట్రాక్‌పై కొందరు దుండగులు పెద్ద ఎత్తున రాళ్లను ఉంచారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి.. ఈ విపత్తును ముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. రాజస్థాన్‌లోని భిల్వారా సమీపంలో ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందచేందుకు రైల్వే ట్రాక్‌లపై వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి రాళ్లు ఉంచారు.
అయితే రైల్వే సిబ్బంది దీనిని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, సిబ్బంది రైల్వే ట్రాక్‌పై రాళ్లను క్లియర్ చేసిన తర్వాత వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ముందుకు కదలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రైలు పట్టాలపై భారీగా రాళ్లను ఉంచిన దృశ్యాలను చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.