Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఉద్ధృతి.. కేరళలో 11 వ తరగతి పరీక్షలపై స్టే విధించిన సుప్రీంకోర్టు...

కేరళలో సెప్టెంబర్ 6 నుంచి పదకొండవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎక్కువగా ఉండడంతో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

Alarming Situation : SC Stays Kerala Govt Decision To Hold Offline Class XI Exams Amid Rising COVID Cases
Author
Hyderabad, First Published Sep 3, 2021, 4:58 PM IST

కేరళ లో కరోనా ఉద్ధృతి ఆందోళనకరమైన రీతిలో ఉండడంతో అక్కడ వచ్చే వారం నుంచి జరగబోయే పదకొండవ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమాదంలో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది.

కేరళలో సెప్టెంబర్ 6 నుంచి పదకొండవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎక్కువగా ఉండడంతో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేరళ ప్రభుత్వ నిర్ణయంపై  మధ్యంతర స్టే విధించింది,

రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి.  రోజుకు దాదాపు 35 వేల వరకు కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.  దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం అక్కడే ఉంటున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో ఆ వయసు పిల్లలను ప్రమాదం బారిన పడేయలేం’’ ధర్మాసనం తెలిపింది.  దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

 కరోనా  విజృంభన నుంచి కేరళ ఇంకా బయటపడలేదు.  గురువారం అక్కడ 32 వేల కొత్త కేసులు నమోదయ్యాయి కొత్త కేసులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రంలో క్రియాశీల కేసులు కూడా పెరుగుతున్నాయి.  దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం   కేరళ కావడం గమనార్హం. కోవిడ్ వ్యాప్తి పెరగడంతో ఇటీవల అక్కడ మళ్లీ రాత్రి కర్ఫ్యూ విధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios