మహారాష్ట్రలో  72 ఏళ్ల వ్యక్తికి రెండు వేర్వేరు COVID-19 వ్యాక్సిన్ టీకాలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని మీద ఫిర్యాదు అందడంతో అధికారులు ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

జల్నా జిల్లాలోని ఒక గ్రామంలో నివసించే దత్తాత్రయ వాగ్మారే అనే వృద్ధుడు మహారాష్ట్ర రాజధాని ముంబై నుండి 420 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని ఒక గ్రామీణ ఆసుపత్రిలో - భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్ ను మొదటి డోసుగా మార్చి 22 వేయించుకున్నాడు.  

అతను తన రెండో డోస్ టీకాను ఏప్రిల్ 30 న వేయించుకున్నాడు. అయితే అతనికి ఈ సారి కోవాగ్జిన్ కాకుండా.. ఈసారి  సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ టీకా వేశారు. ఇది  తన గ్రామంలోని మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది.

దీనివల్ల అతనికి తేలికపాటి జ్వరం, శరీరంలోని కొన్ని భాగాలలో దద్దుర్లు, యాంక్జైటీ ఆటాక్స్ లాంటి లక్షణాలు స్పల్పంగా కనిపించాయని వాగ్మారే కుమారుడు దిగంబర్ చెప్పారు.

"ఇవి చూసిన మేము  మా నాన్నను పార్టూర్ లోని స్టేట్ హెల్త్ కేర్ సెంటర్కు తీసుకువెళ్ళాం, అక్కడ అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ముందుగా మాకు ఈ విషయం తెలియదు. అయితే ఆ తరువాత ఆయన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గమనించిన తరువాతే విషయం అర్థమయ్యింది...అని దిగంబర్ చెప్పారు.

ఈ తాత్కాలిక ధృవీకరణ పత్రంలో మొదటి డోసు మిస్టర్ వాగ్మారేకు కోవాక్సిన్ ఇచ్చినట్టుగా చూపిస్తుంది. రెండో మోతాదుకు "తుది ధృవీకరణ పత్రం" అతనికి కోవిషీల్డ్ ఇచ్చినట్లు చూపిస్తుంది.

కరోనా వ్యాక్సిన్ : మొదటి డోసు ఒకరకం.. రెండో డోసు మరోరకం.. మంచిదేనా?...

"నా తండ్రి నిరక్షరాస్యుడు, నేను కూడా పెద్దగా చదువుకోలేదు. టీకా కేంద్రంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలే ఏది ఇవ్వాలో చూసుకోవాలి. అది వారి బాధ్యత.’’. అని దిగంబర్ చెప్పారు.

ఇది గమనించిన వెంటనే కుటుంబం తమ గ్రామంలోని ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేసింది. లోపం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇలా రెండు COVID-19 వ్యాక్సిన్లు వేర్వేరు డోసులు ఇవ్వడం వల్ల మొదట్లో అలసట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు పెరుగుతాయని,  ఇలా మిక్స్ డ్ వ్యాక్సిన్ డోసులు వైరస్కు వ్యతిరేకంగా ఎంతవరకు రక్షణ కల్పిస్తాయో.. ఇంకా తేలలేదని మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురితమైన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ నివేదించింది.

ఆస్ట్రాజెనెకా షాట్  మొదటి మోతాదు పొందిన వ్యక్తులు, నాలుగు వారాల తరువాత ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు ఇచ్చినప్పుడు స్వల్పకాలిక దుష్ప్రభావాలను నివేదించారు, ఇవి చాలా తేలికపాటివి అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ది లాన్సెట్లో నివేదించారు.