Asianet News TeluguAsianet News Telugu

'2024లో బీజేపీ పాలన అంతమవుతుంది' 

యూపీలో వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింలు వేధింపులకు గురయ్యారని, రైతులు అల్లాడుతున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. 
 

Akhilesh Yadav slams UP govt, says BJP rule to end in 2024 KRJ
Author
First Published Jun 20, 2023, 3:00 AM IST

బిజెపి పాలనలో ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆయన ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడ్డారు. అలాగే యూపీలో వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింలు వేధింపులకు గురయ్యారని, రైతులు అల్లాడుతున్నారని విమర్శించారు.  

భద్రతా బాధ్యులైన పోలీసులు వ్యాపారుల నుంచి దోచుకుంటున్నారనీ, నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింలు వేధింపులకు గురవుతున్నారనీ, రాష్ట్ర రైతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఉత్తరాది నుంచి బీజేపీ వెళ్లిపోవడం ఖాయమని జ్యోసం చెప్పారు.  

2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విధంగానే 2024లో యూపీలో అధికారం కోల్పోతుందని, అన్నారు.  కోర్టుల్లో జరుగుతున్న హత్యలతో పాటు బహిరంగ దోపిడీ, అత్యాచార కేసులతో ప్రజలు విసిగిపోయారని,  ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జూన్ 7న లక్నో కోర్టులో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ మహేశ్వరి జీవాను కాల్చి చంపినప్పుడు కూడా అఖిలేష్ యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించడం గమనార్హం. 

పోలీసు కస్టడీలో, కోర్టులో, పోలీసు సిబ్బంది సమక్షంలో, పోలీస్ స్టేషన్‌లో ఉన్న వ్యక్తులు కూడా చనిపోతున్నారనీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చంపమని  ఉచిత పాస్ ఇస్తుందని ఆరోపించారు. ఒక వ్యక్తి నియంతృత్వం ఒక స్తాయి వరకు మాత్రమే ఉంటుందని అన్నారు. ప్రజలు లేచి దాని నియంతృత్వాన్ని అంతం చేసే సమయం వస్తుందని ఆయన అన్నారు. 
 
అఖిలేష్ యాదవ్ యూపీలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా విమర్శించారు. రాష్ట్రంలో నడిచే అంబులెన్సులు, ఆసుపత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని, రోగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని, బల్లియాలో ఎండవేడిమితో మృతి చెందిన వారిపై విచారణ జరిపించాలని కోరారు.

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం గత 6 ఏళ్లలో ఒక్క జిల్లా ఆసుపత్రిని కూడా నిర్మించలేదని, కాన్పూర్‌లోని పంకీలో పవర్ ప్లాంట్ ఇంకా ప్రారంభించలేదని అఖిలేష్ విమర్శించారు.  ప్రజలకు కరెంటు కూడా ఇవ్వలేదని, ఈ బాధ్యత ముఖ్యమంత్రిదే అయినా మంత్రులపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios