చెన్నై: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ యువకుడిని ఫోటోలు తీశారనే నెపంతో పోలీసులు కొట్టడంతో  రాజమండ్రి యువకుడు ఆకాష్ మృతి చెందాడు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని  కుటుంబసభ్యులు  కోరుతున్నారు.

ప్రతి 40 ఏళ్లకు ఒక్కసారి  వరదరాజపెరుమాళ్ల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు రాజమండ్రికి చెందిన ఆకాష్ కుటుంబసభ్యులు వచ్చారు. దైవ దర్శనం తర్వాత కంచి  బంగారు బల్లి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు.

దీన్ని చూసిన పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టుగా  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని  కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.