Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్ లోయలో మరోసారి హై అలర్ట్

కశ్మీర్ లోయలో మరోసాని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 

AJK on high alert as tensions with India rise after Pulwama attack
Author
Hyderabad, First Published Feb 22, 2019, 10:59 AM IST


కశ్మీర్ లోయలో మరోసాని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడి జరిగి 43మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. కాగా.. మరోసారి అదే తరహా దాడికి పాల్పడికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు.

శ్రీనగర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రత బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని నిలువరించారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 

ఈ నెల 16, 17తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషేమహ్మద్ నాయకులు, కశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో చర్చలు జరిపినట్లు ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఆ సంభాషణలో జమ్మూ నగరం లేదా జమ్మూ కశ్మీర్ బయటి ప్రాంతంలో ఒకచోట మన జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో ఇంటలిజెన్స్ అధికారులు మన భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios