శివసేన, ఎన్సీపీల సంయుక్త ప్రెస్ మీట్ ప్రారంభమయ్యింది. ఈ ప్రెస్ మీట్ కు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలను శరద్ పవార్ చేసారు. 
తమ సంఖ్యా బలం తమకు ఉందని, అజిత్ పవార్ ఒక్కడు మాత్రమే వెళ్లాడని, శరద్ పవార్ అన్నాడు.

ఉదయం 6.30కు తనకు ఫోన్ వచ్చిందని, గవర్నర్ ఇంట్లో ఏదో మీటింగ్ జరుగుతుందని మాత్రమే సమాచారం వచ్చిందని అన్నాడు. కేవలం అజిత్ పవార్ మాత్రమే ప్రమాణస్వీకారం చేసాడని చెప్పాడు. ఏ ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే కూడా అజిత్ పవార్ తోని వెళ్లలేదని అన్నాడు.

ఒక 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ తో రాజ్ భవన్ కు వెళ్లిన మాట మాత్రం వాస్తవమని, కానీ వారు ఆ ప్రమాణస్వీకారం భ్యాగస్వాములు కారని అన్నారు. ఈ సందర్భంగా ఉదయం అజిత్ పవార్ తోపాటు వెళ్లిన ఒక ఇద్దరు ఎమ్మెల్యేలతోని మాట్లాడించారు.

వారు మాట్లాడుతూ, ఉదయం అజిత్ పవార్ నుంచి ఫోన్ వచ్చిందని, తమను గవర్నర్ బంగ్లా కు రమ్మన్నారని, తాము అక్కడికి ఆయన పిలిస్తే తాము వెళ్ళమని, అక్కడ తామంతా చేరుకున్నాక, అరగంటకు ఫడ్నవీస్, అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేసారని అన్నారు. మా సంఖ్యా బలం మాకుంది, ప్రభుత్వాన్ని మేమే తప్పకుండ ఏర్పాటు చేస్తాం అని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

అజిత్ పవార్ ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడవ్వడం వల్ల అతని వద్ద నిన్న రాత్రి అందరూ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖలు ఉన్నాయని, ఆ లేఖలను ఎమ్మెల్యేల మద్దతుగా గవర్నర్ కు అజిత్ పవార్ చూపెట్టి ఉంటాడని శరద్ పవార్ అభిప్రాయపడ్డాడు.