పూణేలో లాక్‌డౌన్.. ప్రస్తుతానికి ఆ ఉద్దేశ్యం లేదు, కానీ ఏప్రిల్ 2 తర్వాత..!!

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తగ్గిపోయిందనుకున్న వైరస్.. మన నిర్లక్ష్యంతో మరింత విజృంభిస్తోంది. అఫీషియల్‌గా మనదేశంలో సెకండ్ వేవ్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా మహారాష్ట్రను వైరస్ వణికిస్తోంది.

Ajit Pawar to take decision on possible Pune lockdown on April 2 ksp

దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తగ్గిపోయిందనుకున్న వైరస్.. మన నిర్లక్ష్యంతో మరింత విజృంభిస్తోంది. అఫీషియల్‌గా మనదేశంలో సెకండ్ వేవ్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా మహారాష్ట్రను వైరస్ వణికిస్తోంది.

రోజురోజుకి అక్కడ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే పలు నగరాల్లో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్‌ అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో పుణేలోనూ లాక్‌డౌన విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

శుక్రవారం పుణే జిల్లా/ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పుణెలో లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితి లేదని వెల్లడించారు.  అయితే పరిస్థితులు చేజేరేలా వుంటే మాత్రం అప్పటి పరిస్థితిపై సమీక్షించి ఏప్రిల్‌ 2 తర్వాత లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.  

కాగా పుణెలో ఇప్పటి వరకు 4,94,393 పాజిటివ్‌ కేసలు నమోదయ్యాయి. వీరిలో 4,35,859 మంది కోలుకోగా, 8245 మంది వైరస్ వల్ల మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ 50,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో హోలీ వేడుకలపైనా కఠిన ఆంక్షలు విధించామని అజిత్ పవార్ పేర్కొన్నారు. మరోవైపు పూర్తి లాక్‌డౌన్‌పై ప్రజాప్రతినిధుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అజిత్ పవార్‌ స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios