మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో(ఎన్సీపీ) చీలిక చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ఆయన బంధువు, పార్టీ నేత అజిత్ పవార్ తిరుగుబావుట ఎగరవేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో(ఎన్సీపీ) చీలిక చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై ఆయన బంధువు, పార్టీ నేత అజిత్ పవార్ తిరుగుబావుట ఎగరవేశారు. తనకు మద్దతుగా ఉన్న కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. ఈ రోజు మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో షిండే కేబినెట్ విస్తరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత గవర్నర్ రమేష్ బైస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేతలు..
1. ధనంజయ్ ముండే
2. ఛగన్ భుజ్‌బల్
3. దిలీప్ వాల్సే పాటిల్
4. అదితి తట్కరే
5. హసన్ ముష్రీఫ్
6. అనిల్ పాటిల్
7. ఆత్రం ధర్మరావుబాబా భగవంతరావు
8. సంజయ్ బన్సోడే
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంతో పాటుగా ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా అజిత్ పవార్‌కు దక్కే అవకాశం ఉంది. ఇక, ఎన్సీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అజిత్ పవార్‌కే ఉన్నట్టుగా ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నియమితులైన ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వైపే ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రఫుల్ పటేల్ కూడా హాజరయ్యారు. ఆయనకు కేంద్రంలోని మోదీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత కొంతకాలంగా ఎన్సీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై ఆయన అలకబూనినట్టుగా తెలుస్తోంది. అలాగే తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతోనే శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ఎగరవేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు ముంబైలోని అజిత్ పవార్ నివాసంలో ఎన్సీపీ శాసనసభ్యుల బృందం సమావేశమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు. కాగా, అజిత్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ను నియమించాలని సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ముంబైలో జరిగిన ఈ సమావేశం గురించి తనకు తెలియదని శరద్ పవార్ పూణెలో విలేకరులతో అన్నారు.
