Mumbai: ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పై ఎంఎన్ఎస్ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. రాజ్ థాక్రే వ్యాఖ్య‌ల‌పై ఎన్సీపీ నేత‌లు గ‌రంగ‌రం అవుతున్నారు. ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు.  

raj thackeray: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే ప‌ద్వామేళ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎన్సీపీ శ్రేణులు ఖండిస్తూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ్ థాక్రే వ్యాఖ్య‌ల‌పై శ‌ర‌ద్ ప‌వార్, సుప్రియా సూలే, జ‌యంత్ పాటిల్ స్పందిస్తూ..ఆయ‌న‌పై మండిప‌డ్డ‌రు. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ సైతం రాజ్ థాక్రే పై వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 

శరద్ పవార్ కుల రాజకీయాలు చేశారని, అయితే ఎన్సీపీ పుట్టిన తర్వాత రాష్ట్రంలో కులతత్వం పెరిగిపోయిందని ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే శ‌నివారం నాడు ముంబ‌యిలో జ‌రిగిన పాద్వామేళాలో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా రాజ్ ఠాక్రేకి దాదా స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. "అబ్బా.. సాహెబ్ రాజకీయాలన్నీ చూస్తే మీకు జాత్యహంకార రాజకీయాలు కనిపించవు.. అన్ని మతాల రాజకీయాలు చేశాడు.." అంటూ రాజ్ థాకరేపై మండిప‌డ్డ‌రు. 

అజిత్ ప‌వార్ నేతృత్వంలో ఆదివారం నాడు ఇందాపూర్ లో రైతు స‌భ జ‌రిగింది. అక్క‌డ ఆయ‌న మాట్లాడుతూ.. శరద్ పవార్ దార్శనికతపై ప్ర‌శంస‌లు కురించారు. రాజ్ థాక్రే పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. పవార్ సాహెబ్ తన అన్ని రాజకీయాలలో అన్ని మతాలను కొనసాగించాడు. అతను అన్ని కులాలు మరియు మతాల ప్రజలకు నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చాడు. సాహెబ్ ఎప్పుడు కుల రాజకీయాలు చేశాడో ఎవరో చెప్పాలి..మొదటి నుంచి ఇప్పటి వరకు సాహెబ్ తీసుకున్న నిర్ణయాలు చూడండి.. అది చూస్తే ఎవ‌రూ కుల‌, మ‌త రాజ‌కీయాలు చేశార‌నేది మీకు అర్థం అవుతుంది అని అన్నారు. 

అంత‌కు ముందు మహారాష్ట్రలో కుల రాజకీయాలకు ఎన్సీపీ, శరద్ పవార్లే కారణమని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే తీవ్రంగా ఆరోపించారు. 1999లో ఎన్సీపీ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో కుల రాజకీయాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయని ఆరోపించారు. అలాగే, మ‌సీదుల ముందు హ‌నుమాన్ చాలీసా ప్లే చేస్తామ‌ని కూడా వ్యాఖ్యానించారు. రాజ్ థాక్రే వ్యాఖ్య‌లను సంజయ్ రౌత్ కూడా త‌ప్పుబ‌ట్టారు.

Scroll to load tweet…