Asianet News TeluguAsianet News Telugu

చెత్త పారేసి.. రూ. 5వేలు జరిమానా కట్టిన క్రికెటర్.. !

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. గోవాలోని ఓ గ్రామంలో ఆరుబయట చెత్త పారేశాడు. ఇందుకు గాను గ్రామ సర్పంచి ఆదేశాల మేరకు ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాడు.

ajay jadeja fined rs 5 thousands for dumping gadbade in goa - bsb
Author
Hyderabad, First Published Jun 29, 2021, 4:20 PM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. గోవాలోని ఓ గ్రామంలో ఆరుబయట చెత్త పారేశాడు. ఇందుకు గాను గ్రామ సర్పంచి ఆదేశాల మేరకు ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాడు.

గోవా ఉత్తర ప్రాంతంలోని అల్డోనాలో అజయ్ జడేజాకు ఇల్లు ఉంది. రచయిత అమిత్ ఘోష్ సహా అనేక మంది ప్రముఖులు అక్కడ నివసిస్తుంటారు. గోవా పర్యాటక ప్రదేశం కావడంతో చెత్తాచెదారం ఎక్కువగా పొగవుతూ ఉంటుంది. 

జడేజా నివసించే గ్రామానికి సమీపంలోని  నచినోలాలో  విపరీతంగా చెత్త పారేస్తున్నారు. దీంతో ఆ చెత్త ఎవరిదో కనుక్కొని వారికి జరిమానా విధిస్తున్నారు. 

‘ఈ చెత్త వ్యవహారంతో మా గ్రామం విసిగిపోయింది. బయటి నుంచి తీసుకు వచ్చిన చెత్తాచెదారం ఇక్కడే పారేస్తున్నారు. అందుకే ఎవరో తెలుసుకునేందుకు మేము కొందరు యువకులను నియమించుకున్నాం.  ఒక సంచిలో అజయ్ జడేజా పేరు కనిపించింది. భవిష్యత్తులో ఇక్కడ చెత్త పారేయకూడదని మేము ఆయనకు తెలియజేశాం. 

మా నిబంధనల ప్రకారం వివాదానికి తావు లేకుండా ఆయన జరిమానా చెల్లించారు.  గొప్ప క్రికెటర్  మా పక్కనే ఉంటున్నందుకు మేము గర్విస్తున్నాం.  కానీ చెత్త నిబంధనలు అందరూ పాటించాలి’ అని గ్రామ సర్పంచ్ తృప్తి  బండోద్కర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios