లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్యపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ స్పందించింది. ఆర్థిక ఇబ్బందులతో చదువును కొనసాగించలేక, ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్ కు ఎంపికైనా డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఈ శాఖ వివరణ ఇచ్చింది.

స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులు డబ్బుల విడుదలకు అవసరమైన బ్యాంకు ఖాతా వివరాలు, మార్కుల జాబితా, కాలేజీ బోనఫైడ్‌ వంటి ధ్రువపత్రాలను  అప్‌లోడ్‌ చేయాలని కోరుతూ అర్హులకు ఆగస్టులోనే లేఖలు పంపించామని తెలిపింది.

దురదృష్టవశాత్తు ఐశ్వర్య సంబంధిత పత్రాలను సమర్పించలేదని స్పష్టం చేసింది. ఐశ్వర్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ పేర్కొంది. 

కాగా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఐశ్వర్య  ఆత్మహత్య చేసుకున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. విద్యార్ధులందరికీ స్కాలర్‌ షిప్‌లను  విడుదల చేయాలన్నారు.