Asianet News TeluguAsianet News Telugu

భారీగా తగ్గనున్న విమాన ప్రయాణ సమయం, ఎయిర్ స్పేస్ పై ఆర్ధిక మంత్రి కీలక ప్రకటన

భారత ఆర్ధిక ప్రగతికి అత్యంత అవసరమైన సివిల్ ఏవియేషన్ రంగం గురించి మాట్లాడుతూ.... ప్రస్తుతం భారతదేశంలో కేవలం 60 శాతం ఎయిర్ స్పేస్ (గగనతలం) మాత్రమే పౌరవిమానయానం కోసం అందుబాటులో ఉందని దీన్ని పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. 

Air Space to be freed for Civil Aviation: NIrmala Sitharaman
Author
New Delhi, First Published May 16, 2020, 6:00 PM IST

ఇక భారత ఆర్ధిక ప్రగతికి అత్యంత అవసరమైన సివిల్ ఏవియేషన్ రంగం గురించి మాట్లాడుతూ.... ప్రస్తుతం భారతదేశంలో కేవలం 60 శాతం ఎయిర్ స్పేస్ (గగనతలం) మాత్రమే పౌరవిమానయానం కోసం అందుబాటులో ఉందని దీన్ని పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. 

మిగిలిన గగనతలమంతా కూడా రక్షణ రంగం ఆధీనంలో ఉందని, దాన్ని ఇప్పుడు ప్రజా అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె తెలిపారు. ఇంతకుమునుపు విమానాలు ఆర్డినెన్సు డిపోలు, ఇతర రక్షణ రంగానికి చెందిన భవనాలపై ఎగరడానికి అనుమతులు లేవని, ఇకమీదట ఆ అనుమతులు ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. 

ఇలా ఈ గగనాథలన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల సంవత్సరానికి 1000 కోట్లు ఆదా అవడంతోపాటుగా ఎంతో సమయం కూడా కలిసి వస్తుందని నిర్మల సీతారామన్ అన్నారు. 

భారతదేశంలో మరో 6 ఎయిర్ పోర్టులను కూడా పీపీపీ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయడానికి వేలంలో ఉంచుతున్నట్టు, త్వరలోనే ఎయిర్ పోర్ట్ అథారిటీ దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేస్తుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

మరో 12 ఎయిర్ పోర్టుల్లో మరింత ప్రైవేట్ పెట్టుబడులు రానున్నట్టు, తద్వారా అక్కడ మరిన్ని ప్రపంచస్థాయి సదుపాయాల కల్పనకు ఆస్కారముంటుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే ఆయా ఎయిర్ పోర్టుల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయని, వాటిని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టుం ఆమె తెలిపారు. తద్వారా ఈ ఎయిర్ పోర్టుల్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ మరింతగా మెరుగుపడుతుందని ఆమె అన్నారు. 

విమానాలకు సంబంధించి మైంటెనెన్సు రిపేర్ అండ్ ఓవర్ హాల్ విభాగంలో భారతదేశాన్ని హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు. భారతీయ విమానాలు కూడా రిపేర్ కోసమని, సర్వీసింగ్ కోసమని విదేశాలకు వెళ్లి వస్తున్నాయని, దానివల్ల అధిక ఖర్చులు, సమయం కూడా వృధా అవుతుందని ఆమె అన్నారు. 

భారతదేశంలో అవసరమైన టెక్నికల్ సామర్థ్యం, పనితనం ఉన్న మనుషులు నైపుణ్యం అన్ని ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వెళ్లే విమానాలకు ఎమ్మార్వో హబ్ గా అభివృద్ధి చేసేందుకు తగిన రితిలో టాక్సులను తగ్గించనున్నట్టు ఆమె తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios