ఢిల్లీలో వాయు కాలుష్యం : కేంద్ర మంత్రి ఎక్కడ? బాధ్యత లేదా?.. మండిపడుతున్న ఆప్ ...

ఢిల్లీలో గాలి నాణ్యత శుక్రవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి చేరుకుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
 

Air pollution in Delhi: Where is the Union Minister? AAP slams Centre - bsb

ఢిల్లీ : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్న భూపేందర్ యాదవ్ ను ఉద్దేశించి ఓ మీడియా చానెల్ తో మాట్లాడుతూ.. "ఢిల్లీ ఇంత తీవ్రమైన ప్రమాదంలో ఉంటే కేంద్ర పర్యావరణ మంత్రి ఎక్కడున్నారు?" అని ప్రశ్నించారు. 

ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే కాలుష్యకారకాలు పెద్దపాత్ర అని.. ప్రతిపక్ష నాయకులు, కేంద్రం దీనిని పరిష్కరించడానికి అత్యవసర సమావేశాలను నిర్వహించాలి.. అని రాయ్ ఆరోపించారు.

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూల్స్ బంద్...

ఆయన ఇంకా మాట్లాడుతూ.. "ఢిల్లీలో కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగమంచు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది" అని తెలిపారు. కాలుష్య కారక ట్రక్కులు, వాణిజ్య ఫోర్-వీలర్లు, అన్ని రకాల నిర్మాణాలపై నిషేధంతో సహా అన్ని అత్యవసర చర్యలను అత్యవసరంగా అమల్లోకి తెచ్చామని తెలిపారు. 

ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో ఇంత విషమ పరిస్థితి ఉంటే "కేంద్ర పర్యావరణ మంత్రి ఎక్కడ ఉన్నారు? భారతీయ జనతా పార్టీకి ఎటువంటి బాధ్యత లేదా?" అని రాయ్ ప్రశ్నించారు. ఢిల్లీలోని గాలి నాణ్యత శుక్రవారం ఉదయం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి పడిపోయింది.ఈ దశలో కాలుష్య కారక ట్రక్కులు, వాణిజ్య ఫోర్-వీలర్లు, అన్ని రకాల నిర్మాణాలపై నిషేధంతో సహా అన్ని అత్యవసర చర్యలను జాతీయ రాజధాని ప్రాంతంలో వెంటనే అమలు చేయాలి. 

ఈ చర్యలు కేంద్ర వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళిక మూడో దశలో ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ రూపొందించిన పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా, రాజధానిలో వాయు నాణ్యత సూచిక 450 మార్కును అధిగమించడానికి కనీసం మూడు రోజుల ముందు నుంచే ఈ చర్యలు తీసుకోవాలి. 

ఢిల్లీలో ఏక్యూఐ గురువారం ఉదయం 10 గంటలకు 351 నుండి శుక్రవారం ఉదయం 9 గంటలకు 471కి చేరుకుంది, ఇది అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా అకస్మాత్తుగా పెరిగిన కాలుష్య స్థాయిలను ప్రతిబింబిస్తుంది. పొరుగు రాష్ట్రాలలో పంటలు తగలబడుతున్న సంఘటనలు కూడా విపరీతంగా పెరిగాయి. 

ఢల్లీలో ఏక్యూఐ 24 గంటల సగటు.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు నమోదవుతుంది. ఇది వరుసగా గురువారం 392, బుధవారం 364, మంగళవారం 359, సోమవారం 347, ఆదివారం 325, శనివారం 304 గత శుక్రవారం 261గా ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios