Asianet News TeluguAsianet News Telugu

నిలిచిపోయిన ఎయిర్ ఇండియా సర్వీసులు..ప్రయాణికులకు చిక్కులు

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌ ఇండియా విమాన  కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎయిర్‌ ఇండియా ప్రధాన సర్వర్‌లో  శనివారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా  కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

Air India system restored after global server shutdown; flights to be delayed during the day
Author
Hyderabad, First Published Apr 27, 2019, 10:05 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌ ఇండియా విమాన  కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎయిర్‌ ఇండియా ప్రధాన సర్వర్‌లో  శనివారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా  కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

శనివారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నిలిచిపోయారు.  గంట కొద్ది ఎయిర్ పోర్టులో ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. దీనిపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

సీటా-డీసీఎస్‌ సిస్టమ్స్‌ బ్రేక్‌ డౌన్‌ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా అన్ని సర్వీసులకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడానికి తమ సాంకేతిక బృందం పని చేస్తోందని.. తొందరలోనే దీనిని పరిష్కరిస్తామని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios