Asianet News TeluguAsianet News Telugu

పర్సు దొంగతనం చేసిన ఎయిరిండియా పైలట్, సస్పెన్షన్

పర్సు దొంగతనం కేసులో పైలట్‌ను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ-301 విమానంలో పైలట్ రోహిత్.. ఆయన ఎయిరిండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు. 

air india pilot suspended for stealing wallet in sydney
Author
New Delhi, First Published Jun 24, 2019, 10:44 AM IST

పర్సు దొంగతనం కేసులో పైలట్‌ను ఎయిరిండియా సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సిడ్నీ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఏఐ-301 విమానంలో పైలట్ రోహిత్.. ఆయన ఎయిరిండియా రీజనల్ డైరెక్టర్‌గా కూడా పని చేస్తున్నారు.

ఈ నెల 22వ తేదీ ఉదయం విమానం సిడ్నీ నుంచి బయలుదేరే ముందు రోహిత్ ఈ దొంగతనం చేశారని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఉన్న దుకాణం నుంచి ఆయన ఒక పర్సు దొంగిలించారని.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని, నిజమని తేలడంతో రోహిత్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

విమానం ఢిల్లీలో దిగగానే విమానాశ్రయంలోనే రోహిత్‌కు సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందజేశామని, గుర్తింపు కార్డుని అధికారులకు అప్పగించాలని.. తమ అనుమతి లేకుండా రోహిత్ నివాస స్థలమైన కోల్‌కతాను విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios