Asianet News TeluguAsianet News Telugu

చెవిపోగులు, కంకణాలపై నిషేధం.. బొట్టు బిళ్ల పరిమాణం అంతే ఉండాలి .. ఎయిర్ ఇండియా గ్రూమింగ్ మార్గదర్శకాలు

ఎయిరిండియాను టాటా సంస్థ స్వాధీనం చేసుకున్న అనంతరం క్యాబిన్‌ క్రూ, ఎయిర్‌ హోస్టెస్‌లకు వస్త్రధారణ ప్రమాణాలపై కొన్ని మార్గదర్శకాలు, ఆపరేటింగ్‌ విధానాల నిమిత్తం ఆదేశాలు జారీ చేసింది. దీని తర్వాత ఫ్లైట్‌ అటెండెంట్స్‌ కోసం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల కంటే మరింత కఠిన మార్గదర్శకాలను తీసుకొచ్చింది. 

Air India guidelines Air India's New Grooming Rules Include
Author
First Published Nov 24, 2022, 7:27 PM IST

టాటా అధీకృత ఎయిర్ ఇండియా (AI) ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే సిబ్బందికి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని ఆదేశించింది. 40 పేజీల సర్క్యులర్‌లో ఎయిర్ ఇండియా తన సిబ్బంది గ్రూమింగ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో పురుష సిబ్బంది, మహిళా సిబ్బందికి వేర్వేరు సూచనలు జారీ చేసింది.  అందులో వారు ఎలాంటి దుస్తులు, ఉపకరణాలు ధరించాలి, జుట్టును ఎలా ఉంచుకోవాలనే మార్గదర్శకాలను జారీ చేసింది. 

మహిళా సిబ్బంది సంబంధించిన మార్గదర్శకాలు 

>> ఒక సాదా బ్యాంగిల్ మాత్రమే ధరించాలి. వాటికి ఎలాంటి డిజైన్ ఉండకూడదు.

>> సింపుల్ గోల్డ్ లేదా డైమండ్ రౌండ్ టాప్స్ (కమ్మలు), చెవిపోగులు లేదా హియిర్ హ్యాగింగ్స్ ధరించరాదు.  

>> జుట్టుకు సహజ రంగును మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ముడులు వేసే కేశాలంకరణ చేసుకోరాదు. 

>> నాలుగు బ్లాక్ బాబీ పిన్స్ మాత్రమే అనుమతించబడతాయి. 

>> ఐషాడో, లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్. హెయిర్‌ షేడ్‌ అనుకూలంగా ఉండాలి.  

>> పచ్చబొట్లు అసలు వేయించుకోరాదు. 

>> జుట్టును ఎక్కువగా కట్టుకోవడం కూడా నిషేధించబడింది.

>> డిజైన్‌, రాళ్లు లేని కంకణం ధరించేందుకు అనుమతిస్తారు.

>> భుజానికి చాలా ఎత్తుగా లేదా వదులుగా ఉండే బన్ను కట్టకూడదు.

>> బ్లో డ్రై లేదా శాశ్వత స్మూటింగ్‌తో పొట్టి ఓపెన్ హెయిర్ తప్పనిసరి.

>> తల వెంట్రుకలకు ఫ్యాషన్‌ రంగులు, గోరింటను వేసుకోవడాన్ని అనుమతించరు. 

>> మణికట్టు, మెడ, చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు కట్టుకోవడం నిషేధం. 

>> బొట్టు బిళ్ల సైజు 0.5 సెం.మీ కంటే ఎక్కువగా ఉండకూడదు.

>> రెండు ఉంగరాలను ధరించాలి. ఒక్కొక్కటి 1 సెం.మీ వెడల్పు మాత్రమే ఉండాలి.

మగ సిబ్బంది సంబంధించిన మార్గదర్శకాలు 

>> బ్లాక్ జాకెట్ ధరించడం తప్పనిసరి.

>> వ్యక్తిగత టై పిన్‌లు అనుమతించబడవు. టైలను మాత్రమే ధరించాలి. 

>> యూనిఫారంలో  లోగో లేకుండా నలుపు సాక్స్ ధరించవచ్చు.

>> జుట్టును చక్కగా కత్తిరించుకోవాలి.

>> మగ క్యాబిన్‌ క్రూ సభ్యులు తప్పనిసరిగా హెయిర్‌ జెల్‌ వాడాలి.

>> బట్టతల ఉన్నవారు ప్రతి రోజూ షేవింగ్ చేయాల్సి ఉంటుంది. 

>> ఉంగరాలు , కంకణాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇవ్వబడ్డాయి. 

>> కేవలం వివాహ ఉంగరం మాత్రమే ధరించాలి. అది కూడా 0.5 సెంటీమీటర్ల మందం మాత్రమే ఉండాలి.  

>> బ్రాస్‌లెట్‌పై ఎలాంటి లోగో లేదా డిజైన్ ఉండకూడదు. 

>> క్రూ కట్‌ అనుమతించరని నిబంధనల్లో పేర్కొన్నారు.

ఈ మార్గదర్శకాలను తప్పని సరిగా ఆచరించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios