న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో   ఎయిరిండియా బోయింగ్ విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విమానంలో లోపాలను సరిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది.

 

ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిరిండియా ( బోయింగ్ 777) విమానంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  విమానంలోని  పవర్ సెంటర్‌లో మరమత్తులు చేస్తున్న సమయంలో  అగ్నిప్రమాదం వాటిల్లింది.

ఈ ఘటన బుదవారం అర్ధరాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ప్రయాణీకులు ఎవరూ కూడ లేరని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

ఈ ఘటనకు సంబంధించి ఎయిరిండియా గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. బోయింగ్ 777 విమానాన్ని  సాధారణ తనిఖీలు  చేసే సమయంలో 
ఈ ప్రమాదం వాటిల్లిందని  ప్రకటించింది.